అక్రమ వలసదారుల తరలింపు తథ్యం: అమిత్ షా

దేశంలోని ఏ ప్రాంతంలో నివసిస్తున్న అక్రమ వలసదారులైన వారిని అంతర్జాతీయ చట్టం ప్రకారం తప్పనిసరిగా వారి వారి దేశాలకు పంపేస్తామని హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జావేద్ అలీ ఖాన్ అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అస్సోం రాష్ట్రంలో మాత్రమే ఉన్న ఎన్‌ఆర్సీ(జాతీయ పౌరసత్వ రిజిస్టర్)ని.. త్వరలోనే దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని అమిత్ షా వెల్లడించారు. ఇది తమ మేనిఫెస్టోలో కూడా ఉందని గుర్తు చేసిన […]

అక్రమ వలసదారుల తరలింపు తథ్యం: అమిత్ షా
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2019 | 5:11 PM

దేశంలోని ఏ ప్రాంతంలో నివసిస్తున్న అక్రమ వలసదారులైన వారిని అంతర్జాతీయ చట్టం ప్రకారం తప్పనిసరిగా వారి వారి దేశాలకు పంపేస్తామని హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జావేద్ అలీ ఖాన్ అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అస్సోం రాష్ట్రంలో మాత్రమే ఉన్న ఎన్‌ఆర్సీ(జాతీయ పౌరసత్వ రిజిస్టర్)ని.. త్వరలోనే దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని అమిత్ షా వెల్లడించారు. ఇది తమ మేనిఫెస్టోలో కూడా ఉందని గుర్తు చేసిన ఆయన.. ఆ హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు.

మరోవైపు ఈ విషయంపై మాట్లాడిన హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం అసోంలో ఉన్న ఎన్ఆర్సీపై 25లక్షల వినతులు వచ్చాయని వాటిని పరిశీలించాలని రాష్ట్రపతి సూచించారని పేర్కొన్నారు. జాతీయ పౌరసత్వం రిజిస్టర్‌లో చాలా మంది పేర్లు మిస్ అయ్యాయని.. కొన్ని నకిలీ పేర్లు కూడా నమోదు అయ్యాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్సీపై విధించిన డెడ్‌లైన్‌ను పొడిగించాలని తాము సుప్రీంను కోరినట్లు వెల్లడించారు. కాస్త ఆలస్యమైనా దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీని ప్రవేశపెట్టడం మాత్రం ఖాయమని ఆయన తెలిపారు. ఇక రోహింగ్యాలపై మాట్లాడుతూ.. వారికి సంబంధించిన కచ్చితమైన సమాచారం తమ వద్ద లేదని.. దేశ వ్యాప్తంగా వారు ఉన్నారని.. వారిలో కొందరు బంగ్లాదేశ్‌కు వెళ్లారని.. దానికి సంబంధించిన సమాచారం మొత్తం త్వరలోనే పొందుతామని పేర్కొన్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!