పారిస్‌లో 700 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

రెండు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్‌ జామ్‌ అయితేనే విసుగెత్తిపోతుంది మనకు.. అలాంటిది 700 కిలోమీటర్ల వరకు రోడ్ల మీద వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోతే...! గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ అవుతే..!

పారిస్‌లో 700 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
Follow us

|

Updated on: Oct 31, 2020 | 12:16 PM

రెండు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్‌ జామ్‌ అయితేనే విసుగెత్తిపోతుంది మనకు.. అలాంటిది 700 కిలోమీటర్ల వరకు రోడ్ల మీద వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోతే…! గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ అవుతే..! అలా జరగుతుందా అని అశ్చర్యపోకండి.. ఫ్రాన్స్‌లో అదే జరిగింది.. ఫ్రాన్స్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి మళ్లీ మొదలయ్యింది కదా! వైరస్‌ తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతుండటంతో పాటు హాస్పిటల్స్‌ అన్ని రోగులతో కిక్కిరిసిపోతున్నాయి.. ఐసీయూలో బెడ్స్‌ దొరకడం లేదు.. ప్రజలకు ఎంత చెప్పినా కోవిడ్‌ నిబంధనలను పాటించడం లేదు.. అందుకే ఫ్రాన్స్‌ ప్రభుత్వం మరోసారి డిసెంబర్‌ ఒకటి వరకు లాక్‌డౌన్‌ విధించింది.. పారిస్‌తో పాటు కొన్ని ప్రధాన నగరాలలో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉందని, ప్రజలంతా జాగ్రత్త పాటించాలని ప్రభుత్వం హెచ్చరించింది.. అత్యావసరాల కోసం తప్పితే ఎవరూ బయటకు రావద్దని చెప్పింది.. లాక్‌డౌన్‌ తక్షణమే అమలులోకి రావడంతో హాలీడే ట్రిప్పుల కోసం బయట ప్రాంతాలకు వెళ్లినవారంతా ఇంటిముఖం పట్టారు.. దాంతో పారిస్‌లో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది.. 700 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.. ఇక నుంచి లాక్‌డౌన్‌ చాలా కఠినంగా అమలవుతుందని ప్రధానమంత్రి జీన్‌ కాస్టెక్స్‌ అన్నారు.. ఫ్రెండ్స్‌ ఇళ్లకు వెళ్లడం, నలుగురు కలిసి బయటకు వెళ్లడం ఇక కుదరదని చెప్పేశారు. వైద్య అవసరాలు, నిత్యావసరాల కోసం తప్పితే ఎవరూ బయటకు రావద్దని సూచించారు. మొన్నటి నుంచే అక్కడ రెస్టారెంట్లు, కేఫ్‌లు మూతబడ్డాయి.. అయితే ఇప్పటికే మొదటి లాక్‌డౌన్‌లో నాలుగు నెలలు ఇంటిపట్టునే ఉన్నామని, మళ్లీ లాక్‌డౌన్‌ అంటే విసుగొచ్చేస్తుందని జనం అంటున్నారు.