తోటి అధ్యాపకురాలిని వేధిస్తున్న కీచక టీచరుకు దేహశుద్ధి

వయసు పెరుగుతున్న అతనిలో వక్ర బుద్ధి మారలేదు.. పదేళ్ల క్రితం ఇంటర్ విద్యార్దినిలతో లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తే.. ఇప్పుడు డిగ్రీ కళాశాలలో కూడా ఒక మహిళ అధ్యాపకురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన బంధువులు కీచక టీచరుకు తగినబుద్ధి చెప్పారు.

  • Balaraju Goud
  • Publish Date - 1:05 pm, Fri, 30 October 20
తోటి అధ్యాపకురాలిని వేధిస్తున్న కీచక టీచరుకు దేహశుద్ధి

వయసు పెరుగుతున్న అతనిలో వక్ర బుద్ధి మారలేదు.. పదేళ్ల క్రితం ఇంటర్ విద్యార్దినిలతో లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తే.. ఇప్పుడు డిగ్రీ కళాశాలలో కూడా ఒక అధ్యాపకురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన బంధువులు కీచక టీచరుకు తగినబుద్ధి చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. కంప్యూటర్ శిక్షకుడిగా పనిచేస్తూ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తికి దేహశుద్ధి చేసిన వీడియోలు సోషల్ మీడియా లో హల్ చల్ మారాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ బేసిస్ ఉపాధ్యాయడు వీరారెడ్డి పనిచేస్తున్నాడు. అమ్మాయిలను ఎప్పుడు వంకరగా చూసే వీరారెడ్డి తరుచూ వేధింపులకు గురిచేసేవాడు. ఇదే క్రమంలో మహిళ ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. సెల్ ఫోన్ ఛాటింగ్ ద్వారా అసభ్యకర మెసేజ్ పంపిస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విషయం తెలిసిన అధ్యాపకురాలి బంధువులు వీరారెడ్డిని మందలించారు. అయినప్పటికీ ఆ ప్రబుద్ధుడి ప్రవర్తనలో మార్పు రావకపోవడంతో ఆగ్రహానికి గురైన బాధితురాలి బందువులు వీరారెడ్డి కి దేహశుద్ధి చేశారు.. ఇందుకు సంబంధించి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా వుండగా, ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.