వివేకా హత్య ఇంటి దొంగల పని: పరమేశ్వర్ రెడ్డి

వైఎస్ వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని పరమేశ్వర్ రెడ్డి అన్నారు. వివేకా హత్య జరిగిన రోజు నుంచి అఙ్ఞాతంలోకి వెళ్లిన పరమేశ్వర్ రెడ్డి తాజాగా తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు. ఈ కేసులో పరమేశ్వర్ రెడ్డిని పోలీసులు అనుమానితుడిగా భావిస్తుండగా.. దానిపై మాట్లాడుతూ ఈ హత్యలో తనకు ఎలాంటి భాగం లేదని చెప్పారు. హత్య జరిగిన రోజు నుంచి తనకు అనారోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉన్నానని అన్నారు. వైఎస్ కుటుంబానికి ప్రాణాలు ఇచ్చేవాడిని తప్ప తీసేవాడిని కాదని […]

వివేకా హత్య ఇంటి దొంగల పని: పరమేశ్వర్ రెడ్డి
Follow us

| Edited By:

Updated on: Mar 18, 2019 | 3:30 PM

వైఎస్ వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని పరమేశ్వర్ రెడ్డి అన్నారు. వివేకా హత్య జరిగిన రోజు నుంచి అఙ్ఞాతంలోకి వెళ్లిన పరమేశ్వర్ రెడ్డి తాజాగా తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు. ఈ కేసులో పరమేశ్వర్ రెడ్డిని పోలీసులు అనుమానితుడిగా భావిస్తుండగా.. దానిపై మాట్లాడుతూ ఈ హత్యలో తనకు ఎలాంటి భాగం లేదని చెప్పారు. హత్య జరిగిన రోజు నుంచి తనకు అనారోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉన్నానని అన్నారు.

వైఎస్ కుటుంబానికి ప్రాణాలు ఇచ్చేవాడిని తప్ప తీసేవాడిని కాదని పరమేశ్వర్ తెలిపారు. ముమ్మాటికీ పథకం ప్రకారమే వివేకా హత్య జరిగిందని, ఇది ఇంటి దొంగల పనేనని అనుమానాలు వ్యక్తం చేశారు. వివేకా డ్రైవర్ ప్రసాద్ చాలా మంచి వ్యక్తి అని, వివేకా కొన ఊపిరిలో ఉన్నప్పుడే లేఖ రాయించి ఉంటారని పేర్కొన్నారు. కడప ఎంపీగా షర్మిల, విజయలక్ష్మి పోటీ చేయాలన్న సూచనను కొందరు తప్పు బట్టినట్లు తనతో వివేకా చెప్పారని తెలిపారు. జగన్ సీఎం అయితే వివేకా బలమైన శక్తిగా ఎదిగేవారని, వివేకా ఎదుగుదలను చూడలేకనే హత్య చేశారని చెప్పారు. ఇంట్లో వారి హస్తం లేనిదే వివేకా హత్య జరిగే అవకాశం లేదని, ఇంట్లోనే ఉండి ఆయన హత్యకు పాల్పడ్డారని చెప్పారు.