జగన్‌కు మరో ప్రధాన భద్రతాధికారిగా పరమేశ్వర్ రెడ్డి..!

Parameshwar Reddy Appointed as Chief Security Officer for CM YS Jagan, జగన్‌కు మరో ప్రధాన భద్రతాధికారిగా పరమేశ్వర్ రెడ్డి..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పరమేశ్వర్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. తాజాగా.. పరమేశ్వర్‌ రెడ్డిని సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. కాగా.. పరమేశ్వర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు అడ్మిన్ విభాగంలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. జగన్‌కు ఇప్పటికే అమర్లపూడి జోషి ప్రధాన భద్రతాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రెండో ప్రధాన భద్రతాధికారిగా పరమేశ్వర్‌ రెడ్డిని నియమిస్తూ ఏపీ సర్కారు ఉత్వర్వులు జారీ చేసింది. పరమేశ్వర్ రెడ్డి త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *