‘పానిపట్‌’ సినిమాపై జాట్ల యుద్ధం… ఎందుకంటే?

పానిపట్‌ సినిమాపై జాట్ల అభ్యంతరాలు ఏంటి ? రాజా సూరజ్‌మల్‌ గొప్ప యోధుడా ? పానిపట్‌ సినిమాలో సూరజ్‌మల్‌ పాత్రను తప్పుగా చూపించారా ? అవుననే అంటున్నారు జాట్లు. ఆఫ్గన్‌ సైన్యం నుంచి వేలాదిమంది మరాఠా సైనికులను కాపాడిన ఘనత సూరజ్‌మల్‌దే అంటున్నారు. తమ సంస్కృతిని కించపరుస్తూ ఈ సినిమా తీశారని మండిపడుతున్నారు. రాజస్థాన్‌,హర్యానాలో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. జాట్లు ఉత్తరభారతంలో చాలా పవర్‌ఫుల్‌ కమ్యూనిటీ. భరత్‌పూర్‌ రాజధానిగా జాట్‌ సామ్రాజ్యాన్ని ఏలిన […]

'పానిపట్‌' సినిమాపై జాట్ల యుద్ధం... ఎందుకంటే?
Follow us

| Edited By:

Updated on: Dec 10, 2019 | 11:57 PM

పానిపట్‌ సినిమాపై జాట్ల అభ్యంతరాలు ఏంటి ? రాజా సూరజ్‌మల్‌ గొప్ప యోధుడా ? పానిపట్‌ సినిమాలో సూరజ్‌మల్‌ పాత్రను తప్పుగా చూపించారా ? అవుననే అంటున్నారు జాట్లు. ఆఫ్గన్‌ సైన్యం నుంచి వేలాదిమంది మరాఠా సైనికులను కాపాడిన ఘనత సూరజ్‌మల్‌దే అంటున్నారు. తమ సంస్కృతిని కించపరుస్తూ ఈ సినిమా తీశారని మండిపడుతున్నారు. రాజస్థాన్‌,హర్యానాలో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

జాట్లు ఉత్తరభారతంలో చాలా పవర్‌ఫుల్‌ కమ్యూనిటీ. భరత్‌పూర్‌ రాజధానిగా జాట్‌ సామ్రాజ్యాన్ని ఏలిన రాజా సూరజ్‌మల్‌ వాళ్లకు ఆరాధ్యదైవం. ఢిల్లీ శివార్ల వరకు ఆయన సామ్రాజ్యం విస్తరించి ఉండేది. ఆగ్రా కూడా ఆయన పాలనలో భాగం. వాస్తవానికి మూడో పానిపట్‌ యుద్దంలో ఆఫ్గనిస్తాన్‌ రాజు అహ్మద్‌షా అబ్దాలి చేతిలో మరాఠాలు , పేష్వాలు ఓడిపోయిన తరువాత తిరిగి వస్తున్న సమయంలో వాళ్లకు ఆశ్రయం కల్పించింది రాజా సూరజ్‌మల్‌ అని చెబుతున్నారు. కాని పానిపట్‌ సినిమాలో మరాఠా సేనాధిపతి సదాశివరావును హీరోగా చూపించి సూరజ్‌మల్‌ను ద్రోహిగా చిత్రీకరించడం దారుణమని మండిపడుతున్నారు.

అంతేకాకుండా భరత్‌పూర్‌ జాట్లు మాట్లాడే భాష బ్రజ్‌ అని , కాని సినిమాలో తాము రాజస్థాని, హర్యానా భాషలు మాట్లాడుతునట్టు చూపించి సంస్కృతిని కించపర్చారని మండిపడుతున్నారు. అందుకే సినిమాపై బ్యాన్‌ విధించాలని కోరుతున్నారు. లేదంటే రాజస్థాన్‌, హర్యానాతో పాటు దేశం లోని ఇతర ప్రాంతాల్లో కూడా పానిపట్‌ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.

కాని సినిమాలో అన్నీ వాస్తవాలూ చూపించామని అంటున్నారు పానిపట్‌ దర్శక , నిర్మాతలు. సదాశివరావు సైనికాధికారిగా అద్భుత పాత్రను ఈ యుద్దంలో పోషించినట్టు చూపించారు. పేష్వాలు మరాఠా సైన్యానికి నేతృత్వం వహించాలని సదాశివరావును కోరుతారు. కొంతమంది రాజుల సాయంతో లక్షమంది సైనికులతో భారత్ మీదకు దండెత్తి వచ్చిన ఆఫ్గన్‌ రాజు అహ్మద్‌షా అబ్దాలిని వీరోచితంగా ఎదుర్కొన్న దృశ్యాలను మాత్రం అద్భుతంగా చూపించారు దర్శకుడు అశుతోశ్‌.