Breaking News
  • ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌గా నాగభూషయ్య . ఖమ్మం వైస్‌ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు. ఖమ్మం డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రాయల శేషగిరిరావు. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌గా కొత్వాల శ్రీనివాసరావు ఎన్నిక.
  • మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌గా నిజాంపాషా.. వైస్‌ చైర్మన్‌గా కొర్రమొని వెంకటయ్య. మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా హర్యానాయక్‌ ఎన్నిక.
  • మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌రెడ్డి ఎన్నిక. వైస్‌ చైర్మన్‌గా పట్నం మాణిక్యం. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా శివకుమార్‌ .
  • నల్గొండ డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాక్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా వట్టె జానయ్య. వైస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి.
  • వరంగల్‌ డీసీసీబీ చైర్మన్‌గా మార్నేని రవీందర్‌రావు.. వైస్‌ చైర్మన్‌గా కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రామస్వామినాయక్‌ వైస్‌ చైర్మన్‌గా దేశిని శ్రీనివాస్‌రెడ్డి.

నలభై కుక్కలకు విషమిచ్చారు.. కారణం తెలిస్తే షాక్

Panchayat workers poison 40 stray dogs in Andhra Pradesh's Vijaywada, నలభై కుక్కలకు విషమిచ్చారు.. కారణం తెలిస్తే షాక్

ఏపీలో వీధికుక్కల బెడద తగ్గించేందుకు ఓ గ్రామపంచాయితీ సిబ్బంది చేసిన పని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గ్రామస్థులు కుక్కల బెడద తగ్గించమని కోరినందుకు.. ఆ గ్రామ పంచాయితీ సిబ్బంది ఆ వీధి కుక్కలను పట్టకుని ఏకంగా వాటికి విషమిచ్చి చంపేశారు. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే విజయవాడ మహానగరంలో నిత్యం వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయని శివారు ప్రాంతమైన రామవరప్పాడు గ్రామ పంచాయితీ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పంచాయితీ సిబ్బంది.. గ్రామంలోని కుక్కలను బంధించి.. వాటిని ఓ వ్యాన్‌లో ఎక్కించారు. అయితే ఆ తర్వాత వాటిని విషపూరితమైన కెమికల్ ఇంజెక్షన్లు ఇచ్చి హతమార్చారు. ఈ తతంగం చూసిన అక్కడి ప్రజలు.. విషయాన్ని జంతు ప్రేమికుల చెవికి చేరవేశారు. గ్రామ పంచాయితీ సిబ్బంది చేసిన దారుణమైన ఘటనపై జంతుప్రేమికులు మండిపడ్డారు. అంతేకాదు ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.

అయితే గత కొద్ది రోజులుగా బెజవాడ నగరంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంటుండటంతో కాలనీ వాసులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. పలుమార్లు ఈ వీధికుక్కలు చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లను సైతం కరుస్తుండటంతో తీవ్ర గాయాలపాలవుతున్నారు. అంతేకాదు ఆ కుక్కలు విహారంతో వాహనదారులకు కూడా ఇబ్బందులు కలుగుతున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. కుక్కలు ద్విచక్ర వాహనదారుల మీదకు వెళ్తుండటంతో బైక్ యాక్సిడెంట్‌లు కూడా చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ వీధి కుక్కల దాడిలో గాయపడ్డ వారు చికిత్స పొందడానికి వేల రూపాలయ ఖర్చు చేయాల్సి వస్తుంది. కుక్కకాటుకు సంబంధించిన మందులు సరైనవి లభించకపోవడం అందుబాటులో లేకపోవడంతో.. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చుపెట్టుకోవాల్సిన పరిస్ధితి నెలకొంటోంది. అయితే వీధి కుక్కలను నియంత్రించడంలో అధికారుల నిర్లక్ష్యం ఎక్కువైదంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సిబ్బంది.. వీధి కుక్కలను వేటాడటం మొదలు పెట్టారు. ఎక్కడ వీధికుక్క కనిపిస్తే దానిని పట్టుకుని.. దానిపై విష ప్రయోగం చేయడం మొదలుపెట్టారు. గత కొద్ది రోజులుగా వీధికుక్కలను పట్టుకుని విషపూరిత ఇంజెక్షన్ల ద్వారా చంపేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

అయితే మూగ జీవాలతో ఇబ్బందులు కల్గుతున్న మాట వాస్తమేనని.. అయితే వాటిని ఇంత క్రూరంగా ఇంజెక్షన్లు ఇచ్చి హతమార్చడం ఏంటని జంతుప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. వాటిని పట్టుకుని వేరే ప్రాంతంలో (జనావాసం లేని) విడిచి పెట్టకుండా వాటిపై రసాయన దాడులు (కెమికల్ ఇంజెక్షన్స్ ఉపయోగించి) చేసి ఈ విధంగా హతమార్చడమేంటంటూ మండిపడుతున్నారు. అయితే నిబంధనల ప్రకారం అలా ప్రజలు ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. ఆ వీధి కుక్కలను పట్టుకుని వేరే ప్రాంతంలో విడిచి పెట్టాలి. కానీ అలా చేయకుండా వాటిపై విష ప్రయోగం చేసి హతమార్చడం నిబంధనలను అతిక్రమించడమే అవుతుంది. వీధికుక్కలే కాదు ఏ మూగ జీవాలతోనైనా ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు, స్థానికులు ఫిర్యాదు చేస్తే.. వాటిని జనావాసాల నుంచి దూరంగా మాత్రమే వదిలేయాలి. కానీ ప్రస్తుతం అలా చేయకుండా వాటిని హతమారుస్తూ.. నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. అయితే ఈ ఘటనలు పునరావృతం కాకుండా వాటిని ఎలా తరలించాలన్నదానిపై ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

Related Tags