టీవీ9 నుంచి జాతీయ స్థాయిలో హిందీ న్యూస్ ఛానల్

దేశాన్ని మారుద్దాం రండి జాతీయ మీడియాలో టీవీ9 ముద్ర న్యూఢిల్లీ: టీవీ9 నుంచి జాతీయ స్థాయిలో హిందీ న్యూస్ ఛానల్ మొదలు కాబోతోంది. టీవీ9 వార్తా సంస్థ నుంచి దేశ వ్యాప్తంగా పలు భాషల్లో ప్రజలకు నిరంతర వార్తా సమాచారం అందుతోంది. అయితే జాతీయ స్థాయిలో, హిందీ భాషలో మాత్రం ఆ విధంగా లేదు. తాజాగా ఆ లోటు లేకుండా చేస్తూ “టీవీ9 భారత్ వర్ష్” పేరుతో సరికొత్తగా హిందీ భాషలో న్యూస్ ఛానల్ రాబోతోంది. మరికొన్ని […]

టీవీ9 నుంచి జాతీయ స్థాయిలో హిందీ న్యూస్ ఛానల్
Follow us

|

Updated on: Mar 16, 2019 | 4:26 PM

  • దేశాన్ని మారుద్దాం రండి
  • జాతీయ మీడియాలో టీవీ9 ముద్ర

న్యూఢిల్లీ: టీవీ9 నుంచి జాతీయ స్థాయిలో హిందీ న్యూస్ ఛానల్ మొదలు కాబోతోంది. టీవీ9 వార్తా సంస్థ నుంచి దేశ వ్యాప్తంగా పలు భాషల్లో ప్రజలకు నిరంతర వార్తా సమాచారం అందుతోంది. అయితే జాతీయ స్థాయిలో, హిందీ భాషలో మాత్రం ఆ విధంగా లేదు. తాజాగా ఆ లోటు లేకుండా చేస్తూ “టీవీ9 భారత్ వర్ష్” పేరుతో సరికొత్తగా హిందీ భాషలో న్యూస్ ఛానల్ రాబోతోంది.

మరికొన్ని రోజుల్లో అధికారికంగా మొదలు కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రత్యేక ప్రోమో సాంగ్‌‌ను యాజమాన్యం విడుదల చేసింది. దేశాన్ని మారుద్దాం రండి అంటూ ఆ పాట సాగుతుంది. ఈ వీడియోకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. www.tv9bharatvarsh.com పేరుతో వెబ్‌సైట్ కూడా విజయవంతంగా నిర్వహించబడుతోంది. జాతీయ మీడియాలో టీవీ9 ముద్ర సరికొత్తగా ఉండబోతోంది.

2003లో సీఈఓ రవి ప్రకాశ్ టీవీ9 సంస్థను ప్రారంభించారు. అనంతరం జాతీయ స్థాయిలో ఈ సంస్థ అన్ని కోణాల్లోనూ నిరూపించుకుంటూ మీడియా రంగంలో ఎన్నో విజయాలను అందుకుంది.