పాకిస్తాన్ మహిళకు భారత పౌరసత్వం

తెలంగాణలో నివాసం ఉంటున్న పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళకు భారత పౌరసత్వం లభించింది. నిజామాబాద్‌లోని హైమర్‌పూరా కాలనీలో నివాసం ఉంటున్న సదరు మహిళకు అధికారులు భారత పౌరసత్వ పత్రాలను అందజేశారు. వీసాపై ఇండియాకు వచ్చిన ఆమె.. 1988లో నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తనకు భారతీయ పౌరసత్వం కల్పించాల్సిందిగా ఆమె దరఖాస్తు చేసుకుంది. అయితే 31 సంవత్సరాల అనంతరం భారత పౌరసత్వం వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *