ప్రతీకారం తీర్చుకున్న సైన్యం.. పాక్ సైనిక పోస్టు ధ్వంసం

Pakistani post destroyed as Indian Army retaliates after ceasefire violation in Rajouri.. jawan martyred, ప్రతీకారం తీర్చుకున్న సైన్యం.. పాక్ సైనిక పోస్టు ధ్వంసం

పాక్ తన వక్రబుద్ధిని మరోసారి చూపింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. భారత సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. శనివారం రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టర్‌లో పాకిస్థాన్‌ జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. అయితే పాక్ కవ్వింపు చర్యలను భారత్ కూడా ధీటుగా ఎదుర్కొంటోంది. రాజౌరీ సెక్టర్‌ సమీపంలో నియంత్రణ రేఖ అవతల ఉన్న ఓ పాకిస్థానీ పోస్టును ధ్వంసం చేసింది. ఇరు దేశాల మధ్య ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

నౌషేరా సెక్టర్‌లో మోర్టారు షెల్స్‌, తుపాకులు ఉపయోగించి కాల్పులు జరపగా, భారత్‌ కూడా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. రాజోరీ జిల్లాలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాక్‌ దాడులు చేసిందని, అంతే ధీటుగా భారత ఆర్మీ తిప్పికొడుతోందని రక్షణశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *