Breaking News
  • విశాఖలో లైట్‌మెట్రోకు డీపీఆర్‌లు రూపొందించాలని ఆదేశాలు. ఏఎంఆర్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ. 79.91 కిలోమీటర్ల మేర లైట్‌మెట్రోకు ప్రతిపాదనలు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీ నుంచి సలహాలు తీసుకోవాలని ఆదేశం. 60.2 కి.మీ. మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్స్ ఏర్పాటుకు డీపీఆర్‌లు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీల నుంచి డీపీఆర్‌లు ఆహ్వానించాలని ఆదేశం.
  • నిర్భయ దోషులను విడివిడిగా ఉరితీయాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ. ఇప్పటికే తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. రేపు తీర్పు ఇవ్వనున్న జస్టిస్‌ భానుమతి నేతృత్వంలోని.. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 46,448 మంది భక్తులు.
  • విశాఖ: పాయకరావుపేటలో హెటిరో ఉద్యోగి ఒంటెద్దు రాజు ఉరి వేసుకుని ఆత్మహత్య, మృతుడు తూ.గో.జిల్లా పెదపట్నం లంక వాసి.
  • ఢిల్లీ చేరుకున్న ట్రంప్‌ దంపతులు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌ దంపతులకు ఘనస్వాగతం. ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్‌ దంపతుల బస. ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు. ట్రంప్‌ బస చేసిన హోటల్‌ దగ్గర పటిష్ట భద్రత.

కర్నూలు టు..పాకిస్తాన్: 11 ఏళ్ల ప్రేమకథా ప్రస్థానం!

Gulzar Khan hails from Pakistan and went to Saudi in search of a job., కర్నూలు టు..పాకిస్తాన్: 11 ఏళ్ల ప్రేమకథా ప్రస్థానం!

కర్నూలు జిల్లా గడివేముల గ్రామానికి చెందిన పెయింటర్ గుల్జార్ ఖాన్  పాకిస్తాన్ వ్యక్తి అంటూ ఇటీవల సికింద్రాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో గడివేముల గ్రామంలో కలకలం రేపింది. పోలీసుల అదుపులో ఉన్న గుల్జార్ ఖాన్ గత పదకొండేళ్లుగా పెయింటర్ గా పనిచేస్తూ..ఇక్కడే ఉంటున్నట్లుగా గ్రామస్తులు చెప్పారు. అదే గ్రామానికి చెందిన దౌలాబితో పరిచయం ఏర్పడటంతో ఆమెనే పెళ్లి చేసుకున్నాడని వివరించారు.

దౌలాబికి మొదటి భర్త చనిపోగా, హైదరాబాదులో పరిచయమైన గుల్జార్ ఖాన్ ను వివాహం చేసుకుంది. వీరికి ఆరుగురు సంతానం కాగా, ఇద్దరు చనిపోయారు. దౌలాబి మొదటి భర్త  కొడుకు, గుల్జార్ ఖాన్ వల్ల కలిగిన నలుగురు సంతానం గ్రామంలోని ఓ అద్దె ‌ఇంట్లో నివసిస్తున్నారు. గుల్జార్ ఖాన్ పెయింటింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని చెప్పారు. ఈ క్రమంలోనే గత అక్టోబర్ నెలలో ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ పాస్‌పోర్ట్ అప్లై చేసి, పొందినట్లుగా తెలుస్తోంది. అయితే, గతంలో మాత్రం తాను పాక్‌తో పాటు దుబాయ్‌లో ఉన్న తన కుటుంబీకులతో సంప్రదింపులు జరిపేవాడని, స్థానికులతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదని చెప్పారు. ఈ క్రమంలోనే తాను, తన భార్య పిల్లలతో పాకిస్తాన్‌ వెళ్లేందుకు సిద్దపడ్డాడని, ఇంట్లోని వస్తువులు, సామాగ్రిని తమ సమీప బంధువులకు అప్పగించినట్లుగా గ్రామస్తులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌లో ఏర్పాటైన కర్తార్‌పూర్‌ కారిడార్‌ మీదుగా పాక్‌ వెళ్లోచ్చని తెలుసుకున్న గుల్జార్‌.. ఢిల్లీ మీదుగా కర్తార్‌పూర్‌ వెళ్లేందుకు గత కర్నూలు నుంచి రైలులో హైదరాబాద్‌ చేరుకున్నాడు. అప్పటికే  అతడి వ్యవహారాన్ని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి.

అయితే, గత కొంతకాలంగా గుల్జార్ ఖాన్ గడివేముల నుంచి కర్నూలు కు వెళ్ళి పాకిస్తాన్ లోని సియాల్ కోట్ కు తరచూ ఫోన్‌కాల్స్ చేస్తూ ఉండటాన్ని కేంద్ర నిఘా విభాగం గుర్తించింది. ఈ విషయాన్ని గమనించిన కేంద్ర విభాగం అతడి కదలికల పై పక్కా‌నిఘా ఉంచింది. అతడు హైదరాబాదు కు వచ్చిన విషయాన్ని గుర్తించి నగర పోలీసులకు సమాచారం ఇచ్చింది. సికింద్రాబాద్ లోని ఓ లాడ్జిలో ఉన్నగుల్జార్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి ‌తీసుకొని విచారించారు. అతడి నుంచి భారత్‌లో తీసుకున్న గుర్తింపుకార్డులు, పాస్‌పోర్ట్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఐపీసీతో పాటు పాస్‌పోర్ట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గుల్జార్‌ వ్యవహారాన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లుగా సిటీ పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

మరోవైపు..గుల్జార్ ఖాన్ వ్యవహారంపై ఎంక్వైరీ చేయడానికి కేంద్ర నిఘా బృందం గడివేముల గ్రామానికి వెళ్లింది. అతడు నివసించిన ఇంటిని, అతడు పెయింటింగ్ ‌పనిచేసిన స్కూల్ ను అతన్ని సన్నిహితులను విచారించింది. స్థానికులకు పాస్‌పోర్ట్ ఇవ్వడానికి ఎన్నో షరతులు పెట్టే పోలీసులు ఓ పాకిస్థాన్ వ్యక్తికి పాస్‌పోర్ట్ ఎలా ఇచ్చారనే అంశంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related Tags