పుల్వామా టెర్రర్ అటాక్ వెనుక ‘ఆమె’

పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి వెనుక ఓ పాకిస్థానీ యువతి ఉన్నట్లు తెలిసింది. ఆమె హనీ ట్రాప్‌లో చిక్కుకున్న భారత జవాను ఒకరు ఆమెకు సైనిక రహస్యాలను వెల్లడించిన విషయం తాజాగా బయటకు వచ్చింది. జవాను నుంచి సేకరించిన వివరాలను ఆమె ఉగ్రవాదులకు ఇవ్వడంతోనే పుల్వామా ఘటన జరిగినట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తులో ఈ విషయం తేలింది. మధ్యప్రదేశ్‌లోని […]

పుల్వామా టెర్రర్ అటాక్ వెనుక ‘ఆమె’
Follow us

| Edited By:

Updated on: May 18, 2019 | 11:10 AM

పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి వెనుక ఓ పాకిస్థానీ యువతి ఉన్నట్లు తెలిసింది. ఆమె హనీ ట్రాప్‌లో చిక్కుకున్న భారత జవాను ఒకరు ఆమెకు సైనిక రహస్యాలను వెల్లడించిన విషయం తాజాగా బయటకు వచ్చింది. జవాను నుంచి సేకరించిన వివరాలను ఆమె ఉగ్రవాదులకు ఇవ్వడంతోనే పుల్వామా ఘటన జరిగినట్లు సమాచారం. మధ్యప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తులో ఈ విషయం తేలింది.

మధ్యప్రదేశ్‌లోని మోహోలో ఉన్న బీహార్ రెజిమెంట్‌లో అవినాశ్ కుమార్ నాయక్ క్లర్క్‌గా పనిచేసేవాడు. 2018లో అతడు అసోంకు బదిలీ అయ్యాడు. ఆ సమయంలో అవినాశ్‌కు ఓ పాకిస్థాన్ యువతి వాట్సాప్ ద్వారా పరిచయం అయింది. ఆమె వలలో చిక్కుకున్న అవినాశ్.. సైనిక రహస్యాలను చేరవేసినట్లు సమాచారం. వాటిని ఆమె ఉగ్రవాదులకు అందించినట్లు తెలుస్తోంది. ఇలా పక్కా సమాచారాన్ని సేకరించిన ఉగ్రవాదులు పుల్వామా దాడికి పక్కా పథకం రచించారు. కాగా అవినాశ్ బ్యాంకు ఖాతాకు పాకిస్థాన్ నుంచి రూ.50వేలు జమ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అతడికి భోపాల్ ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది.