Pakistanam: ‘ఇండియాలో పాకిస్తాన్’ ! సంస్కృత మ్యాప్ లో వింత !

ఇండియాకు పొరుగున ఉన్న పాకిస్తాన్ పేరు మన సంస్కృత భాషలోకివచ్ఛేసరికి మారిపోయింది. అలాగే ఇంకా ఎన్నో ప్రాంతాలు, నదులు, సిటీలు, రాష్ట్రాల పేర్లు ఆ భాష ప్రకారం 'కొత్త రూపు సంతరించుకున్నాయి'

Pakistanam: 'ఇండియాలో పాకిస్తాన్' ! సంస్కృత మ్యాప్ లో వింత !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 29, 2020 | 2:43 PM

Pakistanam:ఇండియాకు పొరుగున ఉన్న పాకిస్తాన్ పేరు మన సంస్కృత భాషలోకివచ్ఛేసరికి మారిపోయింది. అలాగే ఇంకా ఎన్నో ప్రాంతాలు, నదులు, సిటీలు, రాష్ట్రాల పేర్లు ఆ భాష ప్రకారం ‘కొత్త రూపు సంతరించుకున్నాయి’. 18 ఏళ్ళ తరువాత మొట్టమొదటిసారిగా అప్డేట్ చేసిన ఇండియన్ పొలిటికల్ మ్యాప్ ని సంస్కృత భాషలో విడుదల చేశారు. నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా దీన్ని రిలీజ్ చేయడం విశేషం. చివరిసారి 2002 లో.. నాడు ఏబీ వాజ్ పేయి ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ విధమైన మ్యాప్ ప్రాచుర్యంలోకి వచ్చింది. సైన్స్, టెక్నాలజీ శాఖల మంత్రి హర్ష వర్ధన్ ఈ సంస్కృత, హిందీ భాషల మ్యాప్ ను శుక్రవారం విజ్ఞాన్ భవన్ లో విడుదల చేశారు. ఆయా నగరాలు, రాష్టాలు, తదితరాల పేర్లు హిందీలో ఉన్నప్పటికీ.. వాటి చివర్లలో ‘ఏఎం’, ‘ఏహెచ్’ వంటి పదాలను చేర్చారు. ఉదాహరణకు నాగాలాండ్ రాష్ట్రం పేరును ‘నాగాలాండమ్’ అని, పొరుగున ఉన్న పాకిస్తాన్ దేశాన్ని ‘పాకిస్తానం’ అని పేర్కొన్నారు. ఇలాగే ఎన్నో పేర్లు మారిపోయాయి. హిందీతో బాటు సంస్కృతాన్ని కూడా మరింతగా పాపులర్ చేసేందుకు, ప్రజల్లో ఈ భాష పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.