కర్తార్‌పూర్‌ కారిడార్‌ సర్వీస్ ఛార్జ్ 20 డాలర్లు!

Pakistan to charge Kartarpur pilgrims  as service fee, కర్తార్‌పూర్‌ కారిడార్‌ సర్వీస్ ఛార్జ్ 20 డాలర్లు!

కర్తార్‌పూర్‌ కారిడార్‌ ద్వారా గురుద్వారా సాహిబ్‌ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వచ్చే యాత్రికులకు 20 డాలర్ల రుసుము (రూ.1,400) వసూలు చేయనున్నట్టు పాకిస్థాన్‌ ప్రకటించింది. ఒక్కో యాత్రికుడు 20 డాలర్లు సేవా రుసుం చెల్లించాల్సి ఉంటుందని, అయితే ఇది ప్రవేశ రుసుము కాదని పాక్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మహ్మద్‌ ఫైజల్‌ తెలిపారు. కారిడార్‌ నిర్మాణం కోసం చేస్తున్న ఖర్చు, యాత్రికుల సౌకర్యార్థం నిర్వహణ ఖర్చులను కొంత మేర పూడ్చుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో కార్తార్‌పూర్‌ కారిడార్‌పై భారత్‌-పాక్‌ ఉన్నతాధికారుల మధ్య కొన్ని కీలక అంశాల్లో జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. పాక్‌ రుసుములు వసూలు చేయడం ఏమాత్రం సరికాదని భారత హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రయాణికులకు ఉచిత దర్శనం కల్పించాలని పాక్‌ అధికారులను కోరినా వారు అందుకు అంగీకరించలేదన్నారని చెప్పారు. అయితే, వీసా లేకుండా పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *