Breaking News
  • గుంటూరు: చిలకలూరిపేటలో జేఏసీ నిరసన దీక్ష. దీక్షను ప్రారంభించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది-ప్రత్తిపాటి. నాపై, నారాయణపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టారు. కోర్టులో ఈ ప్రభుత్వానికి పరాభవం తప్పదు-ప్రత్తిపాటి.
  • అమరావతి: ఏపీలో నిరంకుశ పాలన నడుస్తోంది-కొల్లు రవీంద్ర. మండలి చైర్మన్‌ షరీఫ్‌పై మంత్రుల వ్యాఖ్యలు సరికాదు. సీఎం జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు-మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విశాఖ: తహశీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు. సబ్బవరం, భీమిలి తహశీల్దార్‌ కార్యాలయాల్లో సోదాలు.
  • ప.గో: 13 జిల్లాలు అభివృద్ధే సీఎం జగన్‌ ఆశయం-సామినేని ఉదయభాను. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ రెండూ జరగాలి. మండలి చైర్మన్‌ బిల్లులను సలెక్టు కమిటీ పంపడం సరికాదు. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి ఆలస్యం అవుతుంది-సామినేని ఉదయభాను.
  • అమరావతి: సా.4 గంటలకు గవర్నర్‌తో భేటీకానున్న చంద్రబాబు. మండలిలో జరిగిన పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న బాబు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని విజ్ఞప్తి. మండలి చైర్మన్‌పై మంత్రులు, వైసీపీ సభ్యుల తీరుపై ఫిర్యాదు. మండలి రద్దు, రాజధాని అంశం, మీడియాపై కేసులను.. గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్న చంద్రబాబు.

భారత పైలట్లపై కేసు నమోదు చేసిన పాక్‌ అటవీ శాఖ

, భారత పైలట్లపై కేసు నమోదు చేసిన పాక్‌ అటవీ శాఖ

ఇస్లామాబాద్: పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చూపించుకొంటోంది. భారత్ చేపట్టిన వైమానిక దాడుల్లో తమ దేశంలోని అటవీ సంపద నాశనం అయ్యిందంటూ ఆరోపణలు చేపడుతోంది. అంతేకాదు మెరుపు దాడులు చేసిన భారత వైమానిక దళ పైలట్లపై పాకిస్తాన్‌ అటవీ శాఖ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మందికి పైగా జవాన్లను పొట్టబెట్టుకున్న జైషే ఉగ్రస్థావరాలపై భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపిన సంగతి తెలిసిందే. ఈ మెరుపు దాడుల ద్వారా తమ ప్రాంతంలోని 19 చెట్లను భారత పైలట్లు ధ్వంసం చేశారని పాక్‌ అటవీ శాఖ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. మెరుపు దాడుల గురించి ప్రస్తావించిన పాక్‌ క్లైమేట్‌ చేంజ్‌ మినిస్టర్‌ మాలిక్‌ అమీన్‌ మాట్లాడుతూ.. పర్యావరణ ఉగ్రవాదానికి ఇదొక ఉదాహరణ. అక్కడ(బాలాకోట్‌)లో డజన్ల కొద్దీ పైన్‌ చెట్లు నేలకూలాయి. మేమెంతో నష్టపోయాం. ఈ విషయమై చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు.

, భారత పైలట్లపై కేసు నమోదు చేసిన పాక్‌ అటవీ శాఖ
ఈ క్రమంలో భారత్‌ ఎకో టెర్రరిజానికి పాల్పడుతోందంటూ ఐక్యరాజ్యసమితిలో కూడా పాకిస్తాన్‌ ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు పాక్ మీడియాల్లో పలు కథనాలు ప్రసారమవుతున్నాయి. తద్వారా అంతర్జాతీయ సమాజంలో భారత్‌ పరువు తీయొచ్చనే కుట్రలు పన్నుతోంది. కాగా బాలకోట్‌లో ఎంత మంతి ఉగ్రవాదులు హతమయ్యారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు భారత ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు హతమయ్యాయా లేదా చెట్లు కూలాయా అంటూ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం పాక్‌ అటవీ శాఖ ఎఫ్‌ఐఆర్‌తో ఈ యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కన్పిస్తున్నాయి.