పాక్ మరో వికెట్ డౌన్.. టెస్ట్‌లకు రియాజ్ గుడ్ బై!

కరాచీ: పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమిర్ కొద్దిరోజుల క్రితం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో అలజడి రేపింది. అటు ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా అమిర్ నిర్ణయంపై దుమ్మెత్తిపోశారు. 27 ఏళ్ల వయసులోనే టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకుని పాక్‌ క్రికెట్‌కు ద్రోహం చేశావంటూ షోయబ్‌ అక్తర్‌ ఘాటుగా విమర్శించాడు. ఇప్పుడు తాజాగా అమిర్ కోవలోనే వాహబ్ రియాజ్‌ టెస్టులకు గుడ్‌ బై చెప్పనున్నట్లు ఆ దేశ […]

పాక్ మరో వికెట్ డౌన్.. టెస్ట్‌లకు రియాజ్ గుడ్ బై!
Follow us

|

Updated on: Aug 03, 2019 | 3:26 AM

కరాచీ: పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమిర్ కొద్దిరోజుల క్రితం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో అలజడి రేపింది. అటు ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా అమిర్ నిర్ణయంపై దుమ్మెత్తిపోశారు. 27 ఏళ్ల వయసులోనే టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకుని పాక్‌ క్రికెట్‌కు ద్రోహం చేశావంటూ షోయబ్‌ అక్తర్‌ ఘాటుగా విమర్శించాడు. ఇప్పుడు తాజాగా అమిర్ కోవలోనే వాహబ్ రియాజ్‌ టెస్టులకు గుడ్‌ బై చెప్పనున్నట్లు ఆ దేశ మీడియా దునియా న్యూస్ వెల్లడించింది. ప్రస్తుతం కెనడా గ్లోబల్ టీ 20 ఆడుతున్న రియాజ్.. టోర్నీ ముగించుకుని స్వదేశానికి వచ్చాక అధికారికంగా ప్రకటిస్తాడని తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా 34 ఏళ్ళ రియాజ్ 27 టెస్టు మ్యాచ్‌లు ఆడి 83 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు 5/63గా ఉంది.