జాదవ్ రిలీజ్ కి ఫస్ట్ స్టెప్ ? దిగొస్తున్న పాకిస్తాన్ !

Kulbushan jadev, జాదవ్ రిలీజ్ కి ఫస్ట్ స్టెప్ ? దిగొస్తున్న పాకిస్తాన్ !

పాకిస్తాన్ చెరలో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ విడుదలకు మార్గం సుగమమవుతున్నట్టు కనిపిస్తోంది. ఆయనను భారత కాన్సులేట్ అధికారులు రేపు (శుక్రవారం) కలుసుకోవచ్చునని పాకిస్తాన్ గురువారం ప్రకటించింది. జాదవ్ కు పాక్ మిలిటరీ కోర్టు విధించిన మరణశిక్షను సమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో పాక్ అధికారులు ఈ చర్య తీసుకున్నారు. ఆయనను భారత కాన్సులేట్ అధికారులు (దౌత్యవేత్తలు) కలుసుకునే అవకాశం కల్పించాలని కూడా వాల్డ్ కోర్టు పాక్ కి సూచించింది. జాదవ్ విషయంలో ఈ కోర్టు ఇఛ్చిన తీర్పు తమకు పెద్ద విజయమని ఇండియా ఇదివరకే వ్యాఖ్యానించింది. అటు-ప్రధాని మోదీ కూడా.. ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. జాదవ్ కి న్యాయం కలగడం తథ్యమని ట్వీట్ చేశారు.
కుల్ భూషణ్ జాదవ్ దోషిత్వం, మరణశిక్ష ఉత్తర్వులపై సమగ్ర సమీక్ష, పునఃపరిశీలన జరపాలని, ఇక ఆలస్యం చేయకుండా ఆయనకు భారత కాన్సులేట్ అధికారులతో సమావేశమయ్యే అవకాశం కల్పించాలని పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ క్వావీ అహ్మద్ ఆధ్వర్యాన గల 16 మంది సభ్యుల బెంచ్ పాక్ ని ఆదేశించింది. ఈ పదహారుమంది న్యాయమూర్తుల్లో ఒక్కరు మాత్రమే ఈ ఉత్తర్వులతో విభేదించారు. అయితే ఇండియా కోరిన కొన్ని కోర్కెలను మాత్రం ఈ బెంచ్ తోసిపుచ్చింది. జాదవ్ మరణశిక్షను రద్దు చేయాలని, ఆయనను వెంటనే సురక్షితంగా తమ దేశానికి పంపాలని ఇండియా ప్రధానంగా కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *