వార్నీ.. ఇదేం రిపోర్టింగ్ సామీ… వైరల్‌గా పాక్ రిపోర్టర్ వీడియో!

లైవ్‌ రిపోర్టింగ్ పేరుతో పాకిస్థాన్ రిపోర్టర్లు ఇలా వింతగా ప్రవర్తిస్తుండడం కొత్తేమి కాదు. ఆ మధ్యకాలంలో పాకిస్థాన్‌లో గాడిదపై ఎక్కి ఓ రిపోర్టర్ రిపోర్టింగ్ చేస్తూ బొక్క బోర్లాపడి సెన్సేషనల్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరొకరు మరీ లైవ్‌గా ఉంటుందని వరద నీళ్లలో నిలబడి రిపోర్టింగ్ చేసిన వైనం జర్నలిస్ట్ లోకాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాదు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. ఇక ఇప్పుడు తాజాగా మరో పాకిస్తానీ రిపోర్టర్ […]

  • Ravi Kiran
  • Publish Date - 8:59 pm, Sun, 28 July 19

లైవ్‌ రిపోర్టింగ్ పేరుతో పాకిస్థాన్ రిపోర్టర్లు ఇలా వింతగా ప్రవర్తిస్తుండడం కొత్తేమి కాదు. ఆ మధ్యకాలంలో పాకిస్థాన్‌లో గాడిదపై ఎక్కి ఓ రిపోర్టర్ రిపోర్టింగ్ చేస్తూ బొక్క బోర్లాపడి సెన్సేషనల్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరొకరు మరీ లైవ్‌గా ఉంటుందని వరద నీళ్లలో నిలబడి రిపోర్టింగ్ చేసిన వైనం జర్నలిస్ట్ లోకాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాదు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది.

ఇక ఇప్పుడు తాజాగా మరో పాకిస్తానీ రిపోర్టర్ వరద నీటిలో నిలబడి రిపోర్టింగ్ చేయడం.. ఆ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేయడం జరుగుతోంది. ఇటీవల పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో వరదలు ముంచెత్తుతున్నాయి. అది ప్రేక్షకులకు కళ్ళకి కట్టినట్లు చూపించడానికి ఓ రిపోర్టర్ వరద నీటిలో మునిగి తేలుతూ లైవ్ రిపోర్టింగ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది గ్రేట్ రిపోర్టింగ్ అని కామెంట్లు పెడుతుంటే.. మరికొందరేమో ఇలా వరద ప్రవాహంలోకి దిగి రిపోర్టింగ్ చేయాల్సిన సీన్ లేదంటూ విమర్శలు చేస్తున్నారు.