ప్రమాదపు అంచుల్లో పాక్ ! అయోమయంలో ఇమ్రాన్ !

టెర్రరిస్టులపై చర్య విషయంలో రోజుకోరకంగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ పరిస్థితి డేంజర్ జోన్ లో పడుతున్నట్టు కనిపిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాల ఆర్ధిక వనరులకు చెక్ పెట్టే కార్యదళం (ఎఫ్ఎటీఎఫ్) పాక్ పై కఠిన చర్యలకు సమాయత్తమవుతోంది. ప్రస్తుతం ప్యారిస్ లో జరుగుతున్న ఈ సంస్థ ప్లీనరీ సమావేశాల్లో పాకిస్తాన్ ను డార్క్ గ్రే లిస్టులో చేర్చే అవకాశం కనబడుతోంది. ఈ సమావేశాల్లో పాక్ కు మద్దతుగా ఏ దేశమూ ముందుకు రాలేదని సమాచారం. ఈ కార్యదళం సూచించిన సిఫార్సుల్లో […]

ప్రమాదపు అంచుల్లో పాక్ ! అయోమయంలో ఇమ్రాన్ !
Follow us

|

Updated on: Oct 15, 2019 | 3:48 PM

టెర్రరిస్టులపై చర్య విషయంలో రోజుకోరకంగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ పరిస్థితి డేంజర్ జోన్ లో పడుతున్నట్టు కనిపిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాల ఆర్ధిక వనరులకు చెక్ పెట్టే కార్యదళం (ఎఫ్ఎటీఎఫ్) పాక్ పై కఠిన చర్యలకు సమాయత్తమవుతోంది. ప్రస్తుతం ప్యారిస్ లో జరుగుతున్న ఈ సంస్థ ప్లీనరీ సమావేశాల్లో పాకిస్తాన్ ను డార్క్ గ్రే లిస్టులో చేర్చే అవకాశం కనబడుతోంది. ఈ సమావేశాల్లో పాక్ కు మద్దతుగా ఏ దేశమూ ముందుకు రాలేదని సమాచారం. ఈ కార్యదళం సూచించిన సిఫార్సుల్లో వేటినీ పాకిస్తాన్ అమలు చేయలేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. మొత్తం 27 అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికలో… ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కేవలం ఆరింటిలో మాత్రమే పురోగతి సాధించినట్టు భావిస్తున్నారు. బ్లాక్ లిస్టుకు, గ్రే లిస్టుకు మధ్య ఉన్నదే డార్క్ గ్రే లిస్ట్.. అంటే బ్లాక్ లిస్టులో చేర్చడానికి ముందున్న లిస్ట్ ఇది ! పాక్ తన వైఖరిని మార్చుకోవడానికి చివరి అవకాశం ఇచ్చేందుకు ఎఫ్ఎటీఎఫ్ సిధ్దమైన తరుణంలో ఆ దేశం ట్రబుల్స్ లో పడే సూచనలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. దీనిపై ఈ నెల 18 న తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. పాక్ ను బ్లాక్ లిస్టులో చేర్చేందుకు ఇండియా తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. చైనా, మలేసియా, టర్కీ దేశాల మద్దతు కారణంగా ఇప్పటివరకు ఆ దేశాన్ని బ్లాక్ లిస్టులో చేర్చి ఉండకపోవచ్ఛునని భావిస్తున్నారు. బ్లాక్ లిస్టులో చేర్చకుండా చూడాలంటే కేవలం మూడు ఓట్లు మాత్రమే అవసరమవుతాయి. గ్రే లిస్టు నుంచి బయటపడాలంటే పాక్ కు 15 దేశాల మద్దతు అవసరమవుతుంది. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం కనబడడం లేదు. అసలు ఎఫ్ఎటీఎఫ్ అంటే ? టెర్రరిస్టుల మనీ లాండరింగ్ ను నిరోధించడానికి, సంబంధిత కార్యకలాపాలను నియంత్రించడానికి 1989 లో ఏర్పాటైన ఇంటర్ గవర్నమెంటల్ బాడీ (అంతర్ ప్రభుత్వ వ్యవస్థ) ఇది.. ప్యారిస్ లోని ఈ వాచ్ డాగ్ సంస్థ గత ఏడాది పాకిస్తాన్ ను గ్రే లిస్టులో చేర్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్ధిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాక్ ను డార్క్ గ్రే లిస్టులో చేర్చితే ‘ మూలిగే నక్కపై తాటిపండు పడినట్టే ‘ !