Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

అక్కడ లీటరు పెట్రోల్ రూ.118.. డీజిల్ ధర రూ.132!

Pakistan Govt, అక్కడ లీటరు పెట్రోల్ రూ.118.. డీజిల్ ధర రూ.132!

తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా రూ. 5.15, రూ.5.65 మేర పెంచుతూ పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశం ఆర్ధికంగా తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇంధన ధరలను పెంచాలంటూ ఆయిల్, గ్యాస్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఓజీఆర్ఏ) చేసిన అభ్యర్థనకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమోదం తెలిపారు. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.117.83కి చేరగా… డీజిల్ ధర రూ. 132.47కు చేరుకుందని స్థానిక మీడియా వెల్లడించింది.

పెట్రోల్‌, డీజిల్ ధరలతో పాటు కిరోసిన్, లైట్ డీజిల్ ధరలు కూడా వరుసగా రూ.5.38, రూ.8.90 మేర పెరిగాయి. దీంతో కిరోసిన్ ధర రూ.132.47కి చేరుకోగా, లైట్ డీజిల్ ధర రూ.103.84కి పెరిగింది. కాగా ఇంధన ధరల పెంపుపై పాక్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.