కుల్‌భూషణ్‌ విచారణకు పాక్ స్పెషల్ బెంచ్ ఏర్పాటు

పాకిస్తాన్ కుట్రలకు బలై ఆ దేశ చెరలో బంధీగా ఉన్న మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ కేసులో మరోసారి వాదనలు వినేందుకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు ఏర్పాటు చేసినట్లు పాక్‌ మీడియా పేర్కొంది.

కుల్‌భూషణ్‌ విచారణకు పాక్ స్పెషల్ బెంచ్ ఏర్పాటు
Follow us

|

Updated on: Jul 31, 2020 | 1:02 AM

పాకిస్తాన్ కుట్రలకు బలై ఆ దేశ చెరలో బంధీగా ఉన్న మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ కేసులో మరోసారి వాదనలు వినేందుకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు ఏర్పాటు చేసినట్లు పాక్‌ మీడియా పేర్కొంది. దీనికి ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అథర్‌ మినల్లా నాయకత్వం వహించనున్నారు. అలానే జాదవ్ తరఫున వాదనలు వినిపించేందుకు ఒక న్యాయవాదిని కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

అంతర్జాతీయ న్యాయస్థానాలకు సంబంధించి సవరణలు చేసిన కొత్త బిల్లును ఈవారం పాక్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో చేసిన సవరణలు అమల్లోకి వస్తే జాదవ్‌ తన మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాలు చేయవచ్చని సమాచారం. జులై 17, 2019న జాదవ్‌ కేసు విచారణ సందర్భంగా ఐసీజే సూచనల మేరకు ఈ చట్టంలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం పాక్‌ సర్కార్ కొత్త కుట్రకు తెరలేపింది. తనకు విధించిన మరణ శిక్షపై రివ్యూ పిటిషన్‌ వేయడానికి జాదవ్‌ నిరాకరించాడని, తొలుత దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌పైనే విచారణ జరపాలని నిర్ణయించినట్లు తెలిపింది. దీంతో జాదవ్ తన నేరాన్ని అంగీకరిస్తున్నట్లు అంతర్జాతీయ సమాజానికి చూపే కుట్ర పన్నుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రణాళిక ప్రకారమే పాక్‌ జాదవ్‌ తనకున్న అవకాశాలను ఉపయోగించుకోకుండా సంబంధిత పత్రాలు ఇవ్వకుండా అంతర్జాతీయ చట్టాలను ఉల్లఘింస్తోందని భారత విదేశాంగ శాఖ ఆరోపిస్తోంది. గతవారం భారత్ కోరిక మేరకు రెండోసారి జాదవ్‌ను కలిసేందుకు న్యాయవాది ద్వారా దౌత్యవేత్తలకు అనుమతినిచ్చింది. మొదటిసారిగా 2019 సెప్టెంబరు నెలలో భారత ప్రతినిధులు జాదవ్ ను కలుసుకుంది. అయితే, పాక్ చేసే కుట్రలను ప్రపంచ దేశాలకు ఎత్తిచూపిన తన వక్రబుద్ధిని ఏ మాత్రం మార్చుకోవడంలేదు దాయాది దేశం.

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..