మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ?

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్ఛే అవకాశాలు కనబడుతున్నాయి. గత ఏడాది నవంబరు నుంచి ఈయన లండన్ లో ఉంటున్నారు. అయితే తిరిగి స్వదేశానికి తిరిగి వఛ్చి రాజకీయాల్లో..

మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 19, 2020 | 8:02 PM

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్ఛే అవకాశాలు కనబడుతున్నాయి. గత ఏడాది నవంబరు నుంచి ఈయన లండన్ లో ఉంటున్నారు. అయితే తిరిగి స్వదేశానికి తిరిగి వఛ్చి రాజకీయాల్లో చురుకైన పాత్ర వహించవచ్ఛునంటున్నారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు తమ పార్టీ నిర్వహించనున్న మల్టీ పార్టీ కాన్ఫరెన్స్ కు హాజరు కావాలని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ఆయనను ఆహ్వానించారు. వర్చ్యువల్ గా ఈ సమావేశానికి అటెండ్ కావాలని ఆయన కోరారు. మూడు సార్లు ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ తన ఆరోగ్య కారణాలపై కోర్టు అనుమతితో లండన్లో ఉంటున్నారు. ఎవెన్ ఫీల్డ్ ప్రాపర్టీస్ కేసులో ఈయన, కుమార్తె, అల్లుడ్ని దోషులుగా కోర్టు లోగడ ప్రకటించింది.