Breaking News
  • త్వరలో జనసేన క్రియాశీలక కార్యకర్తలతో పవన్‌ సమావేశాలు. 4 వారాల పార్టీ కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి.. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తయారు చేయాలి. ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు.. బీజేపీతో ప్రయాణంపై సమావేశాల్లో చర్చించనున్న పవన్‌కల్యాణ్‌. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసిన.. అభ్యర్థుల సమావేశం కూడా ఏర్పాటు చేయాలన్న పవన్‌కల్యాణ్‌.
  • ఇంధన పొదుపులో టీఎస్‌ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో రెండో పురస్కారం. పురస్కారాన్ని అందుకున్న ఎండీ సునీల్‌శర్మ. రాష్ట్ర స్థాయిలో మూడు డిపోలకు దక్కిన అవార్డులు.
  • చెన్నైలో రోడ్డు ప్రమాదం. బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు మృతి. మృతులు తెలుగు యువకులుగా గుర్తింపు. విశాఖకు చెందిన బాలమురళి, హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌గా గుర్తింపు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న బాలమురళి, రాహుల్‌.
  • రాజ్‌కోట్‌ వన్డే: ఆస్ట్రేలియా విజయలక్ష్యం 341 పరుగులు. ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసిన భారత్‌.
  • మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అస్వస్థత. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో సోమిరెడ్డికి చికిత్స.

భయం గుప్పిట్లో పాక్… ఐరాస సాయం కోసం వేడుకోలు

, భయం గుప్పిట్లో పాక్… ఐరాస సాయం కోసం వేడుకోలు

40 మంది భారత సైనికులను పొట్టన బెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్ర స్థాయిలో స్పందిస్తుండడంతో  పాకిస్తాన్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. సరిహద్దుల్లో భారత్ సైన్యాన్ని మొహరిస్తుండటంతో పాక్ వణికిపోతోంది. దీంతో ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఐక్య రాజ్య సమితికి పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్స్‌కి లేఖ రాశారు. పాకిస్తాన్‌పై భారత్ తన సైన్యాన్ని ప్రయోగించే అవకాశం ఉండడంతో మా ప్రాంతంలో భద్రతా పరిస్థితి క్షీణిస్తోందని లేఖలో వెళ్లడించింది. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అని ఖురేషీ సదరు లేఖలో పేర్కొన్నట్టు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. కాగా భారత సైనికులపై పుల్వామాలో జరిగిన దాడి కశ్మీరీ వ్యక్తి పనేననీ… కానీ విచారణ కూడా పూర్తి కాకుండానే పాకిస్తాన్‌ను నిందించడంలో అర్థం లేదని ఖురేషీ పేర్కొన్నారు. దేశంలోని రాజకీయ కారణాల కోసం భారత్ కావాలని తమపై శత్రు భావాన్ని ప్రదర్శించి, ఉద్రిక్తతలు పెంచుతోందని ఆయన ఆరోపించారు. ఈ నెల 14న కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దాడి వెనుక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఉందని భారత్ చెబుతుండగా… తమకు సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. ఓ వైపు పుల్వామా దాడికి తమదే బాధ్యత అంటూ పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే స్పష్టంగా వీడియో విడుదల చేసినా.. పాకిస్తాన్ బుకాయించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.