అమెరికాకు తెలియకుండా కుట్ర పన్నిన పాక్

న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రైక్స్-2కి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో పాకిస్తాన్ ఎఫ్-16 విమానంతో దాడికి యత్నించింది. అయితే దాన్ని మన హీరో అభినందన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఎఫ్‌-16 యుద్ధ విమానాలను వినియోగించిన సంగతిని పాకిస్తాన్ దాస్తోంది. పాక్ తమ మేదకు ఎఫ్-16ను ప్రయోగించిందని, దాన్ని తాము కూల్చేశామని భారత్ చేసిన ప్రకటనను ఖండించి నాటకమాడింది. అయితే ఎఫ్‌-16 మాత్రమే ప్రయోగించగల అమ్రామ్‌ క్షిపణి శకలాలను భారత త్రివిధ దళాల ఉన్నతాధికారులు గురువారం మీడియా ముందు ప్రదర్శించడంతో […]

అమెరికాకు తెలియకుండా కుట్ర పన్నిన పాక్
Follow us

|

Updated on: Mar 02, 2019 | 10:24 AM

న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రైక్స్-2కి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో పాకిస్తాన్ ఎఫ్-16 విమానంతో దాడికి యత్నించింది. అయితే దాన్ని మన హీరో అభినందన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఎఫ్‌-16 యుద్ధ విమానాలను వినియోగించిన సంగతిని పాకిస్తాన్ దాస్తోంది. పాక్ తమ మేదకు ఎఫ్-16ను ప్రయోగించిందని, దాన్ని తాము కూల్చేశామని భారత్ చేసిన ప్రకటనను ఖండించి నాటకమాడింది. అయితే ఎఫ్‌-16 మాత్రమే ప్రయోగించగల అమ్రామ్‌ క్షిపణి శకలాలను భారత త్రివిధ దళాల ఉన్నతాధికారులు గురువారం మీడియా ముందు ప్రదర్శించడంతో పాక్‌ బుకాయింపు బట్టబయలైంది.

మరి పాక్ ఎందుకు అబద్దమాడుతోంది? ఈ ఎఫ్-16 యుద్ధ విమానాలను అమెరికా నుంచి పాక్‌ కొనుగోలు చేసింది. అయితే కొనుగోలు సమయంలో కీలక ఒప్పందం జరిగింది. యుద్ధానికి దారి తీసేలా ఏ దేశంపైకీ ప్రయోగించకూడదనేది అందులో కీలకమైనది. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్‌ పైకి ప్రయోగించింది. దీంతో ఈ విషయం అమెరికాకు తెలిస్తే ఒప్పంద ఉల్లంఘనతో తమకు నష్టం జరుగుతుందని భయపడుతోంది. అమెరికా నుంచి కొత్తవి కొనుగోలు చేయడం కష్టమౌతుందని బుకాయిస్తోంది. అందుకే తాము ఎఫ్‌-16లను వాడలేదంటూ అబద్ధం చెబుతోంది.