పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జె-17 యుధ్ధ విమానాలు ! సైనిక విన్యాసాలు !

లదాఖ్ సరిహద్దుల్లో  భారత-చైనా ఉద్రిక్తతల సమస్య ఇంకా పరిష్కారం కాకముందే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 'స్కార్ధు' వైమానిక స్థావరం వద్ద పాకిస్తాన్ తన జె-17 ఫైటర్లను మోహరించింది. ఆక్రమిత గిల్గిట్-బల్టిస్తాన్ ప్రాంతంలో..

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జె-17 యుధ్ధ విమానాలు ! సైనిక విన్యాసాలు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 26, 2020 | 6:42 PM

లదాఖ్ సరిహద్దుల్లో  భారత-చైనా ఉద్రిక్తతల సమస్య ఇంకా పరిష్కారం కాకముందే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ‘స్కార్ధు’ వైమానిక స్థావరం వద్ద పాకిస్తాన్ తన జె-17 ఫైటర్లను మోహరించింది. ఆక్రమిత గిల్గిట్-బల్టిస్తాన్ ప్రాంతంలో వైమానిక, సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది. చైనా ఆదేశాలతో వీటిని నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పాక్ ఎయిర్ స్టాఫ్ చీఫ్ మార్షల్ ముజాహిద్ అన్వర్ ఖాన్ ఈ నెల 24-25 తేదీల్లో ఈ ప్రాంతంలో కొన్ని ముఖ్య సమావేశాలు జరిపారని, సైనిక విన్యాసాలను పర్యవేక్షించారని సమాచారం.

లదాఖ్ సరిహద్దుల్లో చైనా సేనలు, జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో పాక్ దళాలు ఏక కాలంలో భారత సైన్యంపై దాడులకు పాల్పడవచ్ఛునన్నఊహాగానాలు తలెత్తుతున్నాయి. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ సిధ్ధంగా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.