భారత్ యువతితో.. పాక్ క్రికెటర్ పెళ్లి!

Pakistan cricket star Hasan Ali set to marry Indian girl, భారత్ యువతితో.. పాక్ క్రికెటర్ పెళ్లి!

పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మాదిరిగానే ఆ జట్టుకు చెందిన పేసర్ హాసన్ అలీ త్వరలోనే ఓ భారత యువతిని వివాహం చేసుకోనున్నాడు. ఈ విషయాన్ని హాసన్‌కు సన్నిహితుడైన వ్యక్తి వెల్లడించాడు. ఆగష్టు 20న దుబాయిలోని అట్లాంటిస్ పామ్ హోటల్‌లో షామియ అర్జుతో హాసన్ అలీ పెళ్లి జరగనుందని సమాచారం. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పటు సన్నిహితులు హాజరు కానున్నారు. ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్ జరుగుతున్న సమయంలో హాసన్ షామియాతో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. హర్యానాకు చెందిన షామియా(25) ఇంగ్లండ్‌లోని మానవ్‌ రచన యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి.. ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *