కుల్‌భూషణ్‌ను కలిసేందుకు నో పర్మిషన్.. : పాక్

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. పాక్ చెరలో బందీగా ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను దౌత్యాధికారులు రెండోసారి కలిసేందుకు అనుమతించబోమంటోదంది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలతో సెప్టెంబరు 2న జాదవ్‌ను కలిసేందుకు పాక్‌ అంగీకరించిన విషయం తెలిసిందే. ఎట్టేకేలకు ఐసీజే ఆదేశాలతో పాక్.. భారత్‌కు కాన్సులర్ అనుమతిచ్చింది. దీంతో భారత దౌత్యాధికారి గౌరవ్‌ అహ్లువాలియా కుల్‌భూషణ్‌ను కలిశారు. దాదాపు రెండు గంటలపాటు గౌరవ్‌ ఆయనతో మాట్లాడారు. అయితే ఆ సమయంలో జాదవ్‌ తీవ్ర […]

కుల్‌భూషణ్‌ను కలిసేందుకు నో పర్మిషన్.. : పాక్
Follow us

| Edited By:

Updated on: Sep 13, 2019 | 11:31 AM

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. పాక్ చెరలో బందీగా ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను దౌత్యాధికారులు రెండోసారి కలిసేందుకు అనుమతించబోమంటోదంది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలతో సెప్టెంబరు 2న జాదవ్‌ను కలిసేందుకు పాక్‌ అంగీకరించిన విషయం తెలిసిందే. ఎట్టేకేలకు ఐసీజే ఆదేశాలతో పాక్.. భారత్‌కు కాన్సులర్ అనుమతిచ్చింది. దీంతో భారత దౌత్యాధికారి గౌరవ్‌ అహ్లువాలియా కుల్‌భూషణ్‌ను కలిశారు. దాదాపు రెండు గంటలపాటు గౌరవ్‌ ఆయనతో మాట్లాడారు. అయితే ఆ సమయంలో జాదవ్‌ తీవ్ర ఒత్తిడిలో ఉండటం స్పష్టంగా కన్పించిందని ఆయన వెల్లడించారు. అయితే, దౌత్యాధికారులు రెండోసారి జాదవ్‌ను కలిసే అవకాశం లేదని పాక్‌ విదేశాంగ ప్రతినిధి మొహమ్మద్‌ ఫైజల్‌ చెప్పారు.

కాగా, గూఢచర్యం ఆరోపణలతో కుల్‌భూషణ్‌ జాదవ్‌ను 2016 మార్చి 3న బలూచిస్థాన్‌లో అరెస్ట్ చేసినట్లు పాక్ బలగాలు వెల్లడించాయి. ఆ తర్వాత జాదవ్‌కు మరణశిక్ష విధిస్తూ పాక్ మిలిటరీ కోర్టు 2017 ఏప్రిల్‌లో తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుపై భారత్ తీవ్రంగా మండిపడింది. పాక్ తీరుపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) ఆశ్రయించింది. వ్యాపార నిమిత్తం ఇరాన్‌ వెళ్లిన జాదవ్‌ను పాక్‌ అపహరించిందని భారత్‌ ఆరోపించింది. దీనిపై విచారణ జరిపిన అంతర్జాతీయ న్యాయస్థానం కుల్‌భూషణ్ జాదవ్‌ మరణశిక్షపై స్టే విధించింది. అంతేగాక.. పాకిస్థాన్ జాదవ్‌కు కాన్సులర్‌ అనుమతి ఇవ్వకపోవడాన్ని కూడా తప్పుబట్టింది. జాదవ్‌ను భారత అధికారులు కలిసేలా కాన్సులర్‌ అనుమతి ఇవ్వాలని పాక్‌కు ఆదేశాలు జారీ చేసింది.