పాకిస్థాన్‌తో జాగ్రత్త.. కోహ్లీసేనకు దాదా సూచన!

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో పాటు పాకిస్థాన్ కూడా ఫేవరెట్ అని టీమిండియా మాజీ సారధి సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రతీ టోర్నీలో పాక్ జట్టుకు మంచి రికార్డు ఉందని.. అంతేకాకుండా 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను పాక్ ఓడించిన సంగతి దాదా గుర్తు చేశాడు. ‘ఇంగ్లాండ్‌లో నిర్వహించే ప్రపంచ టోర్నీల్లో పాకిస్థాన్‌కు అద్భుతమైన రికార్డుంది. రెండేళ్ల క్రితమే వారు ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచారు. 2009లో అక్కడే […]

పాకిస్థాన్‌తో జాగ్రత్త.. కోహ్లీసేనకు దాదా సూచన!
Follow us

|

Updated on: May 16, 2019 | 8:58 PM

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో పాటు పాకిస్థాన్ కూడా ఫేవరెట్ అని టీమిండియా మాజీ సారధి సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రతీ టోర్నీలో పాక్ జట్టుకు మంచి రికార్డు ఉందని.. అంతేకాకుండా 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను పాక్ ఓడించిన సంగతి దాదా గుర్తు చేశాడు.

‘ఇంగ్లాండ్‌లో నిర్వహించే ప్రపంచ టోర్నీల్లో పాకిస్థాన్‌కు అద్భుతమైన రికార్డుంది. రెండేళ్ల క్రితమే వారు ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచారు. 2009లో అక్కడే టీ20 ప్రపంచకప్‌ కూడా గెలిచారు. ఇంగ్లాండ్‌లో ఎప్పుడైనా పాక్‌ మెరుగ్గానే రాణిస్తుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో కూడా 374 పరుగుల లక్ష్యాన్ని పాక్ దాదాపు చేధించినంత పని చేసింది. ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లోనే టెస్టు సిరీస్‌లో ఓడించింది. పాకిస్థాన్ జట్టు సర్ఫరాజ్ అహ్మద్ సారధ్యంలో అద్భుతంగా రాణిస్తోంది. ప్రపంచ టోర్నీలో దాయాదిపై భారత్‌కు మెరుగైన రికార్డు ఉన్నంత మాత్రాన సరిపోదు. తనదైన రోజున పాక్‌ను ఓడించడం సులభమేమీ కాదు. అయితే భారత జట్టు పటిష్ఠంగా ఉంది. కోహ్లీ, రోహిత్‌, శిఖర్ ధావన్‌ వంటి ఆటగాళ్లున్న జట్టును బలహీనంగా ఉందనలేం. ఇంగ్లాండ్‌, పాక్‌, వెస్టిండీస్‌ జట్లలో మంచి ఆటగాళ్లు ఉన్నారు. ఆయా జట్లుకు కూడా ప్రపంచకప్‌ను గెలిచే సామర్ధ్యం ఉంది. అందుకే కోహ్లీసేనపై ఒత్తిడి ఉంటుందని’  దాదా పేర్కొన్నాడు.

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!