కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్‌ కన్నింగ్ వేషాలు

పాకిస్థాన్ తన కవ్వింపు చర్యలకు కన్నింగ్ వేషాలను కలుపుతోంది. ఇప్పటి వరకు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కాల్పులకు తెగబడే విషయం తెలిసిందే. అయితే ఈ సారి..

కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్‌ కన్నింగ్ వేషాలు
Follow us

| Edited By:

Updated on: Aug 04, 2020 | 10:06 PM

పాకిస్థాన్ తన కవ్వింపు చర్యలకు కన్నింగ్ వేషాలను కలుపుతోంది. ఇప్పటి వరకు సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. కాల్పులకు తెగబడే విషయం తెలిసిందే. అయితే ఈ సారి తన కన్నింగ్ వేషాలకు పదునుపెట్టింది. పాక్ మ్యాప్‌ను మార్చుతూ.. కొత్త మ్యాప్‌ను ప్రవేశపెట్టారు. దీనికి ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. ఈ కొత్త మ్యాప్‌కు మంత్రివర్గమే కాదు.. ప్రతిపక్షాలు కూడా మద్దతు పలికాయంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు. అయితే ఈ మ్యాప్‌లో పాక్‌ ప్రదేశాలతో పాటుగా.. భారత్‌లోని పలు ప్రాంతాలను కూడా చూపిస్తూ.. సరికొత్త వివాదానికి తెరలేపింది. జమ్ముకశ్మీర్, లదాఖ్‌లోని కొన్న ప్రాంతాలను పాక్‌ తమవేనంటూ కొత్త మ్యాప్‌లో చూపిస్తోంది. అంతేకాదు.. గుజరాత్‌లోని పలు ప్రాంతాలను కూడా తమవేనంటూ చూపిస్తోంది. తమ కొత్త మ్యాప్ ద్వారా.. జమ్ముకశ్మీర్‌ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ కొత్త మ్యాప్‌ను ప్రపంచం ముందు పెడుతున్నామంటూ ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు.

Read More :

మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు