మీరొద్దు… మీ మందులు మాత్రం కావాలి ..పాక్ వితండ వాదన

భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య కశ్మీర్‌ అంశంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా ఈ అంశంపై ఇరుదేశాల నడుమ అంతర్గత యుద్ధ వాతావరణం అలుముకుంది. ప్రస్తుత సమయంలో కూడా పాక్‌ దేశానికి భారత్‌ నుంచి అత్యవసర ఔషధాల ఎగుమతి కొనసాగుతోంది. భారత్‌తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకున్న పాకిస్థాన్‌ ఔషధాల దిగుమతి విషయంలో మాత్రం ఎటువంటి నిషేధాన్నీ విధించలేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్‌ భారత్‌తో దౌత్య సంబంధాలను కూడా వద్దనుకుంది. అంతే కాకుండా […]

మీరొద్దు... మీ మందులు మాత్రం కావాలి ..పాక్ వితండ వాదన
Follow us

|

Updated on: Sep 03, 2019 | 6:11 PM

భారత్‌ పాకిస్థాన్‌ల మధ్య కశ్మీర్‌ అంశంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా ఈ అంశంపై ఇరుదేశాల నడుమ అంతర్గత యుద్ధ వాతావరణం అలుముకుంది. ప్రస్తుత సమయంలో కూడా పాక్‌ దేశానికి భారత్‌ నుంచి అత్యవసర ఔషధాల ఎగుమతి కొనసాగుతోంది. భారత్‌తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకున్న పాకిస్థాన్‌ ఔషధాల దిగుమతి విషయంలో మాత్రం ఎటువంటి నిషేధాన్నీ విధించలేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్‌ భారత్‌తో దౌత్య సంబంధాలను కూడా వద్దనుకుంది. అంతే కాకుండా వాణిజ్య సంబంధాలను కూడా నిలిపివేసింది. అయితే, ప్రాణావసర ఔషధాల దిగుమతిని మాత్రం కొనసాగిస్తున్నది. కాగా పాకిస్తాన్ నుండి దిగుమతి చేసుకున్న అన్ని వస్తువులపై భారత్‌ 200శాతం కస్టమ్స్‌ సుంకం విధించింది. పాకిస్తాన్‌ గత 16 నెలల్లో 36 మిలియన్‌ డాలర్ల విలువైన యాంటీ రేబిస్‌, యాంటీ – పాయిజన్ వ్యాక్సిన్లను భారతదేశం నుండి దిగుమతి చేసుకున్నట్లు సమాచారం.