మా గగనతలాన్ని మూసేయలేదు: పాకిస్తాన్

భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయలేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన విమానాలను పాక్ గగనతలంలోకి అనుమతించడం లేదని.. మరికొన్ని విమానాలను దారి మళ్లించారని వార్తలు వచ్చాయి. వీటిపై పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ అధికార ప్రతినిధి ముజ్తబా భేగ్ స్పందించారు. ఎప్పటిలాగే విమానాలు నడుస్తున్నాయని, ఏ ఒక్క మార్గంలోనూ దారి మళ్లింపు చేపట్టలేదని వివరణ […]

మా గగనతలాన్ని మూసేయలేదు: పాకిస్తాన్
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2019 | 7:50 AM

భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయలేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన విమానాలను పాక్ గగనతలంలోకి అనుమతించడం లేదని.. మరికొన్ని విమానాలను దారి మళ్లించారని వార్తలు వచ్చాయి. వీటిపై పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ అధికార ప్రతినిధి ముజ్తబా భేగ్ స్పందించారు. ఎప్పటిలాగే విమానాలు నడుస్తున్నాయని, ఏ ఒక్క మార్గంలోనూ దారి మళ్లింపు చేపట్టలేదని వివరణ ఇచ్చారు. ఇక ఇదే విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి డాక్టర్ మహ్మద్ ఫైజల్ సైతం ధ్రువీకరించారు. కాగా భారత విమానాలకు పాక్ గగనతలాన్ని మూసివేసిందని.. దీనివలన విమానాల తరలింపుకు మరో 12నిమిషాల అదనపు సమయం పడుతుందని.. అయినా పాక్ తీసుకున్న ఈ నిర్ణయం వలన తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎయిర్‌ ఇండియా అధికారులు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.