50 ఏళ్లపాటు గుర్తుండేలా పాకిస్థాన్‌‌పై యుద్ధం చేయండి: బాబా రాందేవ్

రాయ్‌పూర్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి ఫైరయ్యారు. పాకిస్థాన్ పై కఠినంగా ఉండాల్సిన సమయమిదేనని అన్నారు. రాయ్ పూర్ లో మాట్లాడుతూ, పాకిస్థాన్ లో బలూచిస్తాన్, పాకిస్థాన్ నైరుతి భాగాల్లో కొనసాగుతున్న వేర్పాటువాద ఉద్యమాలకు భారత్ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆయా ప్రాంత ప్రజలకు విముక్తి కల్పించేందుకు అన్ని విధాలా తోడ్పాటు అందించాలని అని రాందేవ్ విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్‌‌ను మూడు ముక్కలు చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ […]

50 ఏళ్లపాటు గుర్తుండేలా పాకిస్థాన్‌‌పై యుద్ధం చేయండి: బాబా రాందేవ్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:54 PM

రాయ్‌పూర్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి ఫైరయ్యారు. పాకిస్థాన్ పై కఠినంగా ఉండాల్సిన సమయమిదేనని అన్నారు. రాయ్ పూర్ లో మాట్లాడుతూ, పాకిస్థాన్ లో బలూచిస్తాన్, పాకిస్థాన్ నైరుతి భాగాల్లో కొనసాగుతున్న వేర్పాటువాద ఉద్యమాలకు భారత్ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆయా ప్రాంత ప్రజలకు విముక్తి కల్పించేందుకు అన్ని విధాలా తోడ్పాటు అందించాలని అని రాందేవ్ విజ్ఞప్తి చేశారు.

పాకిస్థాన్‌‌ను మూడు ముక్కలు చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా వేల మంది సైనికులు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రతి రోజూ బాధపడడం కంటే ఓ యుద్ధం చేస్తే మేలని, ఆ యుద్ధం మరో 50 ఏళ్ల పాటు పాకిస్థాన్ మనవైపు చూడాలంటేనే వణికిపోయేలా ఉండాలని అన్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలని, మనదేశంలో వేర్పాటువాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ లోనూ భారత్ వేర్పాటువాదాన్ని ఎగదోయాలని సూచించారు.