బాంబు పేలుడుతో అట్టుడికిన పాక్‌..

శుక్రవారం రాత్రి పాకిస్థాన్‌లోని రావల్పిండి బాంబు పేలుడుతో వణికిపోయింది. అత్యంత రద్దీగా ఉండే గారిసన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పేలుడు సంభవించింది.

బాంబు పేలుడుతో అట్టుడికిన పాక్‌..
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2020 | 3:32 PM

శుక్రవారం రాత్రి పాకిస్థాన్‌లోని రావల్పిండి బాంబు పేలుడుతో వణికిపోయింది. అత్యంత రద్దీగా ఉండే గారిసన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరో 15 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని రావల్పిండి పోలసులు తెలిపారు. ఈ పేలుడు విద్యుత్ స్థంభం సమీపంలో చోటుచేసుకోవడంతో సాధారణ పేలుడు అని అంతా అనుకున్నారు. అయితే బాంబ్ స్క్వాడ్‌ వచ్చిన తర్వాత.. ఇది శక్తివంతమైన బాంబు పేలుడు అని ధృవీకరించారు. మార్కెట్‌లోని పార్కింగ్‌ ప్రదేశంలో ఓ వాహనంలో బాంబును అమిర్చినట్లు గుర్తించారు. అయితే ఈ ప్రాంతంలో సైనిక ప్రధాన కార్యాలయం ఉండటంతో పాటు.. గూఢాచారి కార్యలయాలు, పలువురి ఉన్నతాధికారుల నివాసలు ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులను దుండగులు హతమార్చారు. అయితే వారు ఉగ్రవాదులన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే శుక్రవారం మరోసారి బాంబు పేలుడుతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ కూడా ప్రకటించలేదు.