సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులు.. నలుగురు పౌరులకు గాయాలు..

పాకిస్థాన్‌ శనివారం నాడు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. బారాముల్లా జిల్లాలోని రాంపూర్ సెక్టార్ మీదుగా కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో నలుగురు పౌరులు గాయపడ్డారు.

సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులు.. నలుగురు పౌరులకు గాయాలు..
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 6:07 PM

పాకిస్థాన్‌ శనివారం నాడు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. బారాముల్లా జిల్లాలోని రాంపూర్ సెక్టార్ మీదుగా కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో నలుగురు పౌరులు గాయపడ్డారు. శనివారం తెల్లవారు జామునే.. మోర్టార్ షెల్స్‌తో పాటు ఇతర ఆయుధాలను ఉపయోగించి దాడికి పాల్పడింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్‌కు ధీటుగా జవాబిచ్చింది. అంతకుముందు శుక్రవారం నాడు కూడా.. కుప్వారా జిల్లాలోని తాంగ్‌ధర్ సెక్టార్ మీదుగా కాల్పులకు దిగింది.

కాగా, ఇవాళ ఉదయం పాకిస్థాన్‌కు చెందిన ఓ స్పై డ్రోన్‌ను బీఎస్ఎఫ్ కుప్పకూల్చింది. సరిహద్దు దాటి లోనికి వస్తున్న డ్రోన్‌ను గమనించిన సైన్యం.. వెంటనే దాన్ని కుప్పకూల్చింది. ఆ డ్రోన్‌తో పాటు ఆయుధాలను, హ్యాండ్ గ్రేనేడ్‌లను కూడా బీఎస్ఎఫ్ సైన్యం స్వాధీనం చేసుకుంది.