తోకముడిచి.. భారత్ సైన్యాన్ని ప్రాధేయపడ్డ పాకిస్థాన్!

Pakistani Soliders Retrieved The Bodies After Showing White Flag, తోకముడిచి.. భారత్ సైన్యాన్ని ప్రాధేయపడ్డ పాకిస్థాన్!

కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో రగిలిపోతున్న పాకిస్థాన్.. సరిహద్దుల దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీనికి భారత్ ఆర్మీ కూడా అదే స్థాయిలో స్పందిస్తుండటంతో పాక్ ఆర్మీ తోక ముడిచింది. భారత్ ఆర్మీ కాల్చి చంపినా ఇద్దరు పాకిస్థాన్ సైనికుల మృతదేహాలను పాక్ జవాన్లు శాంతికి, లొంగుబాటుకు చిహ్నమైన తెల్ల జెండాను చూపిస్తూ తీసుకెళ్లడం గమనార్హం. ఇక ఈ ఘటన ఇవాళ ఉదయం జమ్మూకాశ్మీర్‌లోని హాజీపూర్ సెక్టార్‌లో చోటు చేసుకుంది.

ఈ నెల 10,11 తేదీల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని హాజీపూర్ సెక్టార్ వద్ద పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. భారత సరిహద్దు గ్రామాలపై పాక్ సైన్యం విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీనికి భారత జవాన్లు ధీటుగా స్పందించి దాయాదిని తిప్పికొట్టడం జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాకిస్థాన్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. భారత సైన్యంపై కాల్పులు జరుపుతూ తన సహచరుల శవాలను తీసుకెళ్లాలని పాక్ రేంజర్లు ప్రయత్నించినా.. ప్రయోజనం లేకపోయేసరికి సెప్టెంబర్ 13న కాల్పులకు స్వస్తి పలికి తెల్ల జెండాలను చూపిస్తూ మృతదేహాలను తీసుకెళ్లారు. కాగా పాక్ సైనికుల మృతదేహాలను అప్పగించేందుకు భారత్ అనుమతించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *