Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 90 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 190535. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 93322. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 91819. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5394. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • నేడు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ. ప్రధాని నివాసంలో భేటీ కానున్న కేంద్ర కేబినెట్. పలు ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేయనున్న కేబినెట్. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, కోవిడ్-19 సహా పలు అంశాలపై చర్చించే అవకాశం.
  • కడపజిల్లా: చెన్నూరు మండల కేంద్రంలో సానిటయిజర్ తాగి తల్లీ కొడుకు మృతి.. మృతులు ఎల్లమ్మ గుడి వీధికి చెందిన కళావతి, శ్రీరామ్ నాయక్ లుగా గుర్తింపు.. మత్తు కోసమే సానిటయిజర్ తాగినట్లు పోలీసులు వెల్లడి.. రిమ్స్ కు తరలింపు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • విశాఖ నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కన్యాకుమారి, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతాల్లోకి రుతుపవనాల ఆగమనం అరేబియా సముద్రంలోని ఆగ్నేయ, తూర్పు మధ్య ప్రాంతాల్లో బలపడుతున్న అల్పపీడనం, ఇది ఈనెల మూడు నాటికి తుపానుగా మారి మహారాష్ట్ర, గుజరాత్ ల మీదికి ప్రయాణిస్తుందని అంచనా తెలంగాణ ,కోస్తాంధ్రలలో నేడు కూడా కొనసాగనున్న గాలివానలు.
  • విజయవాడ: రైల్వే డివిజన్ గుంటూరు నుండి సికింద్రాబాద్ కి బయలుదేరిన గిల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్. గుంటూరు నుండి వయ విజయవాడ, వారంగల్ మీదగా సికింద్రాబాద్ చేరుకోనున్న ట్రైన్. ఇంటర్ స్టేట్ ట్రైన్ ప్రయాణాన్ని తాత్కాలికంగా ఆపిన రైల్వేశాఖ. ఇంటర్ స్టేట్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళ టికెట్లు క్యాన్సల్ చేయబడ్డాయి. రిజర్వేషన్ పూర్తి మొత్తం సొమ్మును తిరిగి ఇవ్వనున్న రైల్వేశాఖ. ఇంటర్ స్టేట్ సర్వీసులు ఎప్పటినుండి మొదలుకనున్నాయో త్వరలోనే ప్రకటించనున్న రైల్వేశాఖ.
  • అమరావతి: డిజీపీ గౌతమ్ సవాంగ్ కామెంట్స్. అంతరాష్ట్ర రాక పోకలపై షరతులు కొనసాగుతాయి. కదలిక లపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు. ఏపీ కి రావాలనుకునే ప్రయాణీకులు స్పందన పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాలి. కరోన ప్రభావం తక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోం క్వారెంటైన్ లో ఉండాలి.

పాకిస్తాన్ ఎయిర్ క్రాష్.. ఆ ఘోరం చూడలేకపోయాం.. ఇద్దరు క్షతగాత్రుల కథనం

పాకిస్తాన్ లో శుక్రవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. జనావాసాల మధ్య ఈ ప్లేన్ కూలిపోయిన సంగతి తెలిసిందే.
Plane Crash Two Survived, పాకిస్తాన్ ఎయిర్ క్రాష్.. ఆ ఘోరం చూడలేకపోయాం.. ఇద్దరు క్షతగాత్రుల కథనం

పాకిస్తాన్ లో శుక్రవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. జనావాసాల మధ్య ఈ ప్లేన్ కూలిపోయిన సంగతి తెలిసిందే. జాఫర్  మసూద్ అనే బ్యాంకు ఉద్యోగి, మహమ్మద్ జుబేర్ అనే ఓ ఇంజనీరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ దారుణ ప్రమాదాన్ని గురించి వారు వివరిస్తూ.. పైలట్ సజ్జాద్ గల్ మొదట ప్లేన్ ని కిందకు దింపాడని, అయితే జనావాసాల మధ్య విమానం ఉన్నందున మళ్ళీ దాన్ని పైకి ఎగిరేలా చూశాడని చెప్పారు. 10  నిముషాలసేపు గాల్లో విమానం ఎగిరిన అనంతరం.. తను తిరిగి ప్లేన్ ని కిందకు దింపుతున్నట్టు చెప్పాడని తెలిపారు. అలా చెబుతుండగానే విమానం భూమిని బలంగా ఢీ కొన్నదని, ఆ కుదుపునకు తాము ఎక్కడో పడిపోయామన్నారు. కళ్ళు తెరచి చూడగానే దట్టమైన పొగలు, రేగుతున్న మంటల మధ్య విమానం మండిపోవడాన్ని చూశామన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు సిబ్బందితో సహా 91 మంది ప్రయాణికులు మృతి చెందారు. లాహోర్ నుంచి బయలుదేరిన ఈ ప్లేన్ మూడు సార్లు టేకాఫ్ కావడానికి యత్నించి జిన్నా విమానాశ్రయంలో దిగేందుకు యత్నించింది. సజ్జాద్ అనే పైలట్ కు సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ ఈ విమానం ఇంతటి ఘోర ప్రమాదానికి గురి కావడం పాక్ వైమానిక దళ అధికారులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

Plane Crash Two Survived, పాకిస్తాన్ ఎయిర్ క్రాష్.. ఆ ఘోరం చూడలేకపోయాం.. ఇద్దరు క్షతగాత్రుల కథనం Plane Crash Two Survived, పాకిస్తాన్ ఎయిర్ క్రాష్.. ఆ ఘోరం చూడలేకపోయాం.. ఇద్దరు క్షతగాత్రుల కథనం

Related Tags