Breaking News
  • ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని నడపలేం-సీఎం కేసీఆర్‌. ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు. ప్రస్తుతం ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఆర్టీసీకి ఆర్థిక భారం మోసే శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. ఆర్టీసీకి ఉన్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదు. హైకోర్టు తీర్పు తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం-కేసీఆర్‌
  • హైదరాబాద్‌: నేడు రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ. హైకోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ
  • చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైందనడం సమంజసం కాదు. ఇలాంటి ప్రయోగాల్లో చిన్న సమస్యలు తలెత్తే అవకాశం సాధారణం. అంతమాత్రాన చంద్రయాన్‌-2 విఫలమైందనడం సరికాదు -కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌
  • ఎస్‌పీజీ సెక్యూరిటీ ఉపసంహరణపై ప్రియాంకాగాంధీ స్పందన. రాజకీయాల్లో భాగంగానే సెక్యూరిటీ తొలగించారు. ఇకపై ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయి-ప్రియాంక
  • తాజ్‌మహల్‌ పరిసరాల్లో డ్రోన్లు ఎగరేసిన విదేశీ యాత్రికులు. రష్యాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • దేశంలో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు.. పెట్టుబడుల ఉపసంహరణ సరైన పరిష్కారం కాదు-మమతాబెనర్జీ. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం తాత్కాలిక ఉపశమనమే. ఇలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి దోహదం చేయవు-మమత
  • సియాచిన్‌పై పాకిస్తాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు. సియాచిన్‌ వివాదాస్పద ప్రాంతం. అలాంటి ప్రాంతంలో భారత్‌ పర్యాటకాన్ని ఎలా ప్రారంభిస్తుంది. భారత్‌ నుంచి ఎలాంటి మంచిని ఆశించడంలేదన్న పాక్‌
  • ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. గౌహతి, షిల్లాంగ్‌లో కంపించిన భూమి. భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనం

పాకిస్తాన్ పై పెరుగుతున్న అమెరికా ఒత్తిడి.. ఆ ఉగ్రవాదులను ప్రాసిక్యూట్ చేయాల్సిందే..

pak must prosecute 4 arrested terrorists says usa, పాకిస్తాన్ పై పెరుగుతున్న అమెరికా ఒత్తిడి.. ఆ ఉగ్రవాదులను ప్రాసిక్యూట్ చేయాల్సిందే..

పాకిస్తాన్ పై అమెరికా క్రమేపీ ఒత్తిడి పెంచుతోంది. తన గడ్డపై సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను పాక్ ఉక్కుపాదంతో అణచివేయాలని సూచించింది. లష్కరే-తోయిబా టాప్ లీడర్ హఫీజ్ సయీద్ తో బాటు నలుగురిని సాధ్యమైనంత త్వరగా ప్రాసిక్యూట్ చేయాలని అమెరికా దాదాపు డిమాండ్ చేసింది. పాక్ ను బ్లాక్ లిస్టులో పెట్టే విషయమై గ్లోబల్ యాంటీ టెర్రరిస్ట్ వాచ్ డాగ్ అయిన ‘ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ‘ ఓ కీలక నిర్ణయం తీసుకోవడానికి ముందు అమెరికా చేసిన ఈ సూచన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్ లో లష్కరే-తోయిబా, జమాత్-ఉద్-దావా ఉగ్రవాద సంస్థలకు చెందిన నలుగురు టాప్ లీడర్ల అరెస్టు పట్ల యుఎస్ విదేశాంగ శాఖలోని దక్షిణ, సెంట్రల్ ఆసియా బ్యూరో చీఫ్ అలీస్ వెల్స్ హర్షం వ్యక్తం చేశారు. టెర్రరిజ కార్యకలా[పాల కోసం నిధులు సేకరిస్తున్నారన్న అభియోగంపై ప్రొఫెసర్ జాఫర్ ఎక్బాల్. యాహ్యా అజీజ్, మహమ్మద్ అష్రఫ్, అబ్దుల్ సలాం అనే ఈ నలుగురిని పాక్ అధికారులు గత గురువారం అరెస్టు చేశారు. ఇది హర్షణీయమేనని, లష్కరే నేత హఫీజ్ సయీద్ తో బాటు వీరిని కూడా ప్రాసిక్యూట్ చేయాలని అలీస్ వెల్స్ కోరారు.

తమ దేశంలోని ఉగ్రవాదులను మొదట అరెస్టు చేయడం, ఆ తరువాత వారిని విడుదల చేయడం పాక్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్యారిస్ లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ.. ఇక ఈ దేశాన్ని బ్లాక్ లిస్టులో చేర్చే విషయమై నిర్ణయం తీసుకోనుండగా.. పాక్ ఈ నలుగురిని అరెస్టు చేయడం, అమెరికా ఈ సూచన చేయడం విశేషం. గత ఏడాది జూన్ లో ఈ సంస్థ పాకిస్తాన్ ను ‘ గ్రే ‘ లిస్టులో చేర్చింది.
2019 అక్టోబరు నాటికి ఉగ్రవాదుల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో అప్పటికల్లా తెలియజేయాలని పాకిస్తాన్ కు ఈ సంస్థ అల్టిమేటం ఇచ్చింది. ఇరాన్, నార్త్ కొరియా ఇప్పటికే ఈ సంస్థ బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి.
pak must prosecute 4 arrested terrorists says usa, పాకిస్తాన్ పై పెరుగుతున్న అమెరికా ఒత్తిడి.. ఆ ఉగ్రవాదులను ప్రాసిక్యూట్ చేయాల్సిందే..ఇలాఉండగా.. హఫీజ్ సయీద్ పైన, ఐరాస ఉగ్రవాదులుగా ముద్ర వేసిన ఇతర టెర్రరిస్టులపైనా తీసుకున్న చర్యలకు సంబంధించి ఐరాస భద్రతా మండలి జారీ చేసిన తీర్మానాన్ని పాకిస్థాన్ అమలుచేయడంలో విఫలమైందని టాస్క్ ఫోర్స్ సంస్థ దుయ్యబట్టినట్టు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సోమవారం ఢిల్లీలో జరిగిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ ల సమావేశంలో తెలిపారు. దీంతో పాకిస్థాన్ పై ఒత్తిడి పెరిగిందన్నారు.ప్రస్తుతం ప్యారిస్ లో ఈ సంస్థ ప్రతినిధులు సమావేశమైనట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశ పర్యవసానం ఎలా ఉంటుందో తాము నిశితంగా గమనిస్తున్నామని ఆయన చెప్పారు.