ఆ పాప పేరు నాగ్రిక్త..(సిటిజన్‌షిప్‌)..

పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదముద్ర వేసింది. ఐతే ఈ బిల్లుపై ముస్లింలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. కానీ ఈ బిల్లుతో తమ చిరకాల కోరిక నెరవేరబోతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు శరణార్థులు. అంతేకాదు. తమ ఇంట ఇటీవలే జన్మించిన శిశువుకు నాగ్రిక్త. అంటే సిటిజన్‌షిప్‌, పౌరసత్వం అని పేరు పెట్టారు. పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌ నుంచి 2011లో దేశ రాజధాని ఢిల్లీకి వలస వచ్చింది నాగ్రిక్త కుంటుంబం..ఢిల్లీలోని మజ్ను కా తిలా ప్రాంతంలో నివసిస్తోంది. శరణార్థులుగా […]

ఆ పాప పేరు నాగ్రిక్త..(సిటిజన్‌షిప్‌)..
Follow us

|

Updated on: Dec 12, 2019 | 4:45 PM

పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదముద్ర వేసింది. ఐతే ఈ బిల్లుపై ముస్లింలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. కానీ ఈ బిల్లుతో తమ చిరకాల కోరిక నెరవేరబోతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు శరణార్థులు. అంతేకాదు. తమ ఇంట ఇటీవలే జన్మించిన శిశువుకు నాగ్రిక్త. అంటే సిటిజన్‌షిప్‌, పౌరసత్వం అని పేరు పెట్టారు.

పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌ నుంచి 2011లో దేశ రాజధాని ఢిల్లీకి వలస వచ్చింది నాగ్రిక్త కుంటుంబం..ఢిల్లీలోని మజ్ను కా తిలా ప్రాంతంలో నివసిస్తోంది. శరణార్థులుగా వలసొచ్చిన ఈ కుటుంబం..ఎనిమిదేళ్లుగా దేశ పౌరసత్వం కోసం ఎదురుచూస్తోంది. ఐతే పార్లమెంట్‌ పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలపడంతో ఈ కుటుంబం ఆనందపడుతోంది. ఇన్నాళ్లకు తమ కల నెరవేరబోతోందనే సంతోషంతో తమ పాపకు ‘నాగ్రిక్త’ అని నామకరణం చేశారు. పార్లమెంటులో బిల్లు పాస్ కావాలని భగవంతుడికి ప్రార్థనలు కూడా చేసినట్టు తెలిపారు. ఇప్పటికైనా శరణార్థులకు పౌరసత్వం కల్పించే బిల్లును తీసుకొచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇక మజ్ను కా తిలా ప్రాంతంలోని పునరావాస కాలనీల్లో దాదాపు 750 హిందూ శరణార్థ కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరంతా పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వలస వచ్చినవారే. అలాగే రోహిణి సెక్టార్ 9,11,ఆదర్శనగర్,సిగ్నేచర్ బ్రిడ్జి ప్రాంతంలోనూ శరణార్థ కుటుంబాలు చాలా ఉన్నాయి. వారంతా భారత పౌరసత్వం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.