బ్లాక్ లిస్ట్ లో పాక్? ప్యారిస్ గ్రూప్ షాక్!

పాకిస్తాన్‌‌‌‌కు ఫైనాన్షియల్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ టాస్క్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌) గట్టి షాక్‌‌‌‌ ఇచ్చింది.  పాక్‌‌‌‌  టెర్రర్‌‌‌‌ గ్రూపులకు ఆర్థిక సాయం అందిస్తోందని, మనీలాండరింగ్‌‌‌‌కు పాల్పడుతోందని,  ఇండియాపై దాడులు చేస్తోందని ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌ గుర్తించింది.  తాను తయారుచేసిన 40 రూల్స్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌ 32 రూల్స్‌‌‌‌ను ఉల్లంఘించినట్టు  ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్ తెలిపింది. ఏషియా పసిఫిక్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ నిర్ధారించిన రూల్స్‌‌‌‌ను పాటించడంలో పాకిస్తాన్‌‌‌‌ ఫెయిల్‌‌‌‌ అయింది. రూల్స్‌‌‌‌పాటించని పాక్‌‌‌‌పై చర్యలకు అమెరికా, బ్రిటన్‌‌‌‌, జర్మనీ, ఫ్రాన్స్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశాయి. టెర్రిరిజాన్ని  నిర్మూలించడానికి తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన […]

బ్లాక్ లిస్ట్ లో పాక్? ప్యారిస్ గ్రూప్ షాక్!
Follow us

| Edited By:

Updated on: Sep 23, 2019 | 1:32 PM

పాకిస్తాన్‌‌‌‌కు ఫైనాన్షియల్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ టాస్క్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌) గట్టి షాక్‌‌‌‌ ఇచ్చింది.  పాక్‌‌‌‌  టెర్రర్‌‌‌‌ గ్రూపులకు ఆర్థిక సాయం అందిస్తోందని, మనీలాండరింగ్‌‌‌‌కు పాల్పడుతోందని,  ఇండియాపై దాడులు చేస్తోందని ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌ గుర్తించింది.  తాను తయారుచేసిన 40 రూల్స్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌ 32 రూల్స్‌‌‌‌ను ఉల్లంఘించినట్టు  ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్ తెలిపింది. ఏషియా పసిఫిక్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ నిర్ధారించిన రూల్స్‌‌‌‌ను పాటించడంలో పాకిస్తాన్‌‌‌‌ ఫెయిల్‌‌‌‌ అయింది. రూల్స్‌‌‌‌పాటించని పాక్‌‌‌‌పై చర్యలకు అమెరికా, బ్రిటన్‌‌‌‌, జర్మనీ, ఫ్రాన్స్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశాయి. టెర్రిరిజాన్ని  నిర్మూలించడానికి తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన వివరాలను ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌కి  ఈమధ్యనే పాకిస్తాన్‌‌‌‌ అందజేసింది.  అయితే దానిపై  ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్   అసంతృప్తి వ్యక్తంచేసింది. టెర్రరిస్టులకు డబ్బుల సాయం,  మనీ లాండరింగ్‌‌‌‌ లాంటి  ముఖ్యమైన 11 అంశాల్లో ఆ దేశం టార్గెట్‌‌‌‌ చేరుకోలేదని  ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌  స్పష్టం చేసింది. పాకిస్తాన్‌‌‌‌ వాదనలపై  ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌ ప్లీనరీ మీటింగ్‌‌‌‌  అసంతృప్తి వ్యక్తంచేసింది.  ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌ సభ్యుల నమ్మకాన్ని చూరగొనడంలో పాక్‌‌‌‌ ఫెయిల్‌‌‌‌ అయింది.

పాక్‌‌‌‌ను గ్రే లిస్ట్‌‌‌‌లో పెట్టాలని గత ఏడాది జూన్‌‌‌‌లో ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌ నిర్ణయించింది. 27  రూల్స్‌‌‌‌తో  యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ను రెడీచేసింది. దీనిపై గత  ఏడాది రెండుసార్లు రివ్యూ జరిగింది.  జైషే మహ్మద్‌‌‌‌తో పాటు  పాక్‌‌‌‌ కేంద్రంగా పనిచేస్తున్న  చాలా టెర్రిరిస్టు గ్రూపుల కార్యకలాపాలను నివారించడానికి యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ను అమలు చేయాలని ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌ కోరింది. అయినప్పటికీ పాక్‌‌‌‌  వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో గత జూన్‌‌‌‌లోనూ పాక్‌‌‌‌కు గట్టిగా వార్నింగ్‌‌‌‌ ఇచ్చింది. టెర్రర్‌‌‌‌ కార్యకలాపాలపై నిఘా పెంచుతూ తాము రూపొందించిన  యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ను సక్రమంగా అమలుచేయాలని పేర్కొంది. మనీలాండరింగ్‌‌‌‌, టెర్రరిస్టులకు ఆర్థిక సాయం లాంటి విషయాల్లో పాక్‌‌‌‌ తీసుకుంటున్న చర్యలు తాము తయారుచేసిన రూల్స్‌‌‌‌కు అనుగుణంగా ఉండాలని కూడా క్లారిటీ ఇచ్చింది.  ఇంతలా హెచ్చరించినా పాక్‌‌‌‌ వైఖరిలో మాత్రం  ఎలాంటి మార్పు రాలేదు.   దీంతో  ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్  తర్వాత యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ను అమలు చేసింది. దీని అమలు కోసం ఈ ఏడాది అక్టోబరు వరకు పాకిస్తాన్‌‌‌‌కు గడువు ఇచ్చింది. అప్పటికీ ఆ దేశం తీరులో ఎలాంటి మార్పురాకుంటే మాత్రం పాక్‌‌‌‌కు బ్లాక్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ ప్రమాదం తప్పదు.

ఇప్పుడు గ్రే లిస్ట్‌‌‌‌లో ఉన్న పాక్‌‌‌‌  ఈ అక్టోబరునాటికి బ్లాక్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లోకి వెళ్లడం ఖాయమంటున్నారు. ఐఎంఎఫ్‌‌‌‌, వరల్డ్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌, ఏషియా డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లు   గ్రే లిస్ట్‌‌‌‌లో  ఉన్న దేశానికి  తక్కువ గ్రేడింగ్స్‌‌‌‌ ఇస్తాయి. దీనివల్ల పాక్‌‌‌‌కు ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి.  ఈ లిస్ట్‌‌‌‌లో ఉన్న దేశానికి  అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలు సాయం చేయడానికి ముందుకురావు.