పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా బుద్ధి చెప్పిన భారత ఆర్మీ

కరోనా వైరస్ విజృంభిస్తున్నతరుణంలో సైతం కశ్మీర్‌కు పాకిస్తాన్‌తో ఇబ్బంది తప్పడం లేదు. సరిహద్దుల్లో పాకిస్తాన్‌ వైపు నుంచి కాల్పుల మోత ఆగలేదు. ఒకవైపు పాకిస్తాన్‌ కరోనాతో ఇబ్బందులు పడుతోంది. అయినా తన వక్ర బుద్ధిని మాత్రం యధావిధిగా కొనసాగిస్తోంది. తాజాగా పాకిస్థాన్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. మంగళవారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని సుందర్ బనీ సరిహద్దు వద్ద పాక్ సైనికులు మోర్టార్లతో కాల్పులకు తెగబడ్డారు. దీంతో భారత సైనికులు తిప్పికొట్టారు. పాక్ […]

పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా బుద్ధి చెప్పిన భారత ఆర్మీ
Follow us

| Edited By:

Updated on: May 19, 2020 | 11:20 AM

కరోనా వైరస్ విజృంభిస్తున్నతరుణంలో సైతం కశ్మీర్‌కు పాకిస్తాన్‌తో ఇబ్బంది తప్పడం లేదు. సరిహద్దుల్లో పాకిస్తాన్‌ వైపు నుంచి కాల్పుల మోత ఆగలేదు. ఒకవైపు పాకిస్తాన్‌ కరోనాతో ఇబ్బందులు పడుతోంది. అయినా తన వక్ర బుద్ధిని మాత్రం యధావిధిగా కొనసాగిస్తోంది. తాజాగా పాకిస్థాన్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. మంగళవారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని సుందర్ బనీ సరిహద్దు వద్ద పాక్ సైనికులు మోర్టార్లతో కాల్పులకు తెగబడ్డారు. దీంతో భారత సైనికులు తిప్పికొట్టారు. పాక్ సైన్యంపై జరిపిన ఎదురుకాల్పులతో వారు తోకముడిచి పరుగులు పెట్టారు. అయితే పాకిస్తాన్‌తొ జరిగిన క్రాస్ ఫైరింగ్‌లో ఎవరూ గాయపడలేదు.

సోమవారం రాత్రి పాక్ సైనికులు మోర్టార్లతో దాడికి తెగబడ్డారు. గడచిన 12 గంటల్లో పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటం ఇది రెండో సారి. అయితే ఈ కాల్పుల వెనుక ఓ కుట్ర కూడా ఉన్నట్లు ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. కాల్పులు జరుపుతూ.. మరో వైపు ఉగ్రవాదులను సరిహద్దులు దాటించే ప్రయత్నాలు జరుపుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. దీంతో ఎల్ఓసీ వెంట కట్టుదిట్టమైన భద్రతను పెంచుతున్నారు.