కశ్మీర్ కోసం యుద్ధం కూడా చేస్తాం: పాక్ ఆర్మీ చీఫ్

Pak army chief accuses India of imposing Hindutva in Kashmir, కశ్మీర్ కోసం యుద్ధం కూడా చేస్తాం: పాక్ ఆర్మీ చీఫ్

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ వైఖరిపై ప్రపంచ దేశాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇది భారత్ ఆంతరంగిక వ్యవహారమంటూ పక్కకు తప్పుకుంటున్నాయి. ఇది సహించుకోలేని పాక్ రోజుకో వ్యాఖ్య చేస్తు భారత్‌ను కవ్విస్తోంది. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా భారత్‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించాడు. త్వరలోనే భారత్‌తో యుద్ధం తప్పదంటూ బెదింపులకు దిగాడు. కశ్మీర్ లోయలో హిందూత్వాన్ని బలవంతంగా అమలు చేయడానికి భారత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించాడు. భారత సైన్యం కశ్మీర్ లోయలో విధ్వంసాలకు పాల్పడుతుందని వ్యాఖ్యానించాడు కమర్ జావెద్ బజ్వా.

శుక్రవారం పాకిస్తాన్ మీడియాతో మాతో మాట్లాడుతూ భారత్ తీసుకున్న ఆర్టికల్ 370 నిర్ణయాన్ని తాము సవాల్‌గా తీసుకున్నామని, ప్రస్తుతం పాక్ ముందున్న ప్రధాన ఎజెండా కశ్మీర్ మాత్రమేనన్నాడు. తాము కశ్మీర్‌ను వదిలే ప్రసక్తే లేదని, తమ ప్రతి సైనికుడు చివరి రక్తపు బొట్టు వరకు కశ్మీర్ కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించాడు కమర్. మోదీ ప్రభుత్వం కశ్మీర్ లోయలో బలవంతంగా హిందూత్వాన్ని రుద్దే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తూ కశ్మీర్ ప్రజలకు మేము తోడుగా ఉన్నామని, మీకోసం మేము యుద్ధానికైనా సిద్ధమంటూ ప్రకటించాడు.

భారత ప్రభుత్వం జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కల్పించే 370 రద్దు తర్వాత పాక్ అనేక సార్లు కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు భారత్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు పాక్ సైన్యం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే భారత సైన్యం పాక్ సైన్యానికి ధీటుగా జవాబునిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *