Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

భారత గిరిజన మహిళా ! నీ కళ ఇటలీలో !

paintings of 80 year old madhyapradesh woman displayed in italy, భారత గిరిజన మహిళా ! నీ కళ ఇటలీలో !

కళలకు ఎల్లలు, హద్దులు ఉండవన్న మాట నిజం.. భారత కళాత్మకత విదేశాల్లోనూ హైలైట్ అవుతోందంటే అందుకు జస్ట్.. 80 ఏళ్ళ వృధ్ధ మహిళ కూడా కారణమంటే ఆశ్చర్యం కలగక మానదు. అదే విచిత్రం ! ఇందుకు ఉదాహరణగా మధ్యప్రదేశ్ లోని ఉమేరియా జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ.. ఎనిమిది పదుల వయసున్న జోధైయా బాయి బైగా ని చెప్పుకోవచ్చు. ఆమె చేతుల్లో అద్భుతమైన కళ ఉట్టిపడుతోంది. తన జీవితంలో సగం చక్కని పెయింటింగుల చిత్రీకరణలోనే గడిపేస్తూ వస్తోంది. తన భర్త మరణించాక.. నాలుగు దశాబ్దాలుగా తన ముసలి వయస్సులోనూ వణకుతున్న చేతులతోనే చిత్రాలు వేస్తోంది. లోర్హా గ్రామవాసి అయిన బైగా.. ఒక పరాయి దేశంలో తన చిత్రకళను గుర్తించడం తనకెంతో సంతోషంగా ఉందని అంటోంది. అయితే ఆ పరాయి దేశమేధో చెప్పలేకపోయింది. ‘ నాచుట్టూ ఉన్న పరిసరాలు, లేదా జంతువులు, లేక ప్రకృతి నన్నీ చిత్రకళకు ప్రేరేపిస్తోంది.. వాటి రూపాలను గుర్తుంచుకుని బొమ్మలు గీస్తుంటాను ‘ అని ఆమె చెప్పింది. పెయింటింగులు వేయడంలో కొంతకాలం ఆమెకు శిక్షణ ఇఛ్చిన ఆశిష్ స్వామి.. తన ‘ శిష్యురాలు ‘ ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది.. ‘ అంటున్నారు. తన జీవితంలో ఈమె ఎన్నో విషాదకర అనుభవాలను ఎదుర్కొందని ఆయన తెలిపారు. ఇటలీలో బైగా చిత్రకళ ప్రదర్శితం కావడం అద్భుతం అన్నారు. ‘ ఆదివాసీలకు ఇది గర్వకారణం.. కానీ వారికి విద్యాసౌకర్యాలు లేవు. అదే విచారకరం. ఎవరో ఒకరు ముందుకు వచ్చి .. ఇలాంటివారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ‘ అని ఆశిష్ స్వామి పేర్కొన్నారు.బైగా వేసిన పెయింటింగులు ఇటలీ లోని మిలన్ లో జరుగుతున్న ఓ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు నోచుకుంది. మరి-దేశ సరిహద్దులను దాటి ఈ వృధ్ధురాలి చిత్ర కళాఖండాలను అక్కడి వరకు చేర్చిన అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలియలేదు. బహుశా ఆశిష్ స్వామి కావచ్ఛేమో !