‘ప‌హిల్వాన్‌’ ప్రీ రిలీజ్ ఇవెంట్ లైవ్!

శాండిల్ వుడ్ బాద్షా.. ‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘ప‌హిల్వాన్‌’. ఎస్‌. కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. తెలుగులోనూ ‘ప‌హిల్వాన్‌’ అనే పేరుతో సెప్టెంబ‌ర్ 12న‌ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో […]

'ప‌హిల్వాన్‌' ప్రీ రిలీజ్ ఇవెంట్ లైవ్!
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2019 | 6:52 PM

శాండిల్ వుడ్ బాద్షా.. ‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘ప‌హిల్వాన్‌’. ఎస్‌. కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. తెలుగులోనూ ‘ప‌హిల్వాన్‌’ అనే పేరుతో సెప్టెంబ‌ర్ 12న‌ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన ‘ప‌హిల్వాన్’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చిన విషయం తెలిసిందే. గురువారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వస్తోందని చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ సినిమాకు క‌రుణాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ‘కె.జి.య‌ఫ్‌’ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసి ఘ‌న విజ‌యాన్ని అందుకున్న వారాహి చ‌ల‌న చిత్రం ఇప్పుడు ‘ప‌హిల్వాన్‌’ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 12న గ్రాండ్‌ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.