తెలంగాణ రైతుకు ఊరట: మరో వారం రోజుల పాటు..

వ్యవసాయానికి పెద్దపీట వేస్తోంది తెలంగాణ సర్కార్. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు కష్టం కలుగకుండా చూసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్‌ 8 వరకు కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మొదట మే 31 వరకే కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పలు ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జూన్‌ 8 వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని అధికారులను ముఖ్యమంత్రి […]

తెలంగాణ రైతుకు ఊరట: మరో వారం రోజుల పాటు..
Follow us

|

Updated on: May 30, 2020 | 6:35 PM

వ్యవసాయానికి పెద్దపీట వేస్తోంది తెలంగాణ సర్కార్. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు కష్టం కలుగకుండా చూసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను జూన్‌ 8 వరకు కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మొదట మే 31 వరకే కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పలు ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జూన్‌ 8 వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

వర్షాలు రాకముందే రైతులు పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ ఇంకా పూర్తి కాలేదని, అనేక గ్రామాల్లో ధాన్యం సేకరించి ఉందని వార్తలు వచ్చాయి. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణ చేసింది. దేశ వ్యాప్తంగా యాసంగి సీజన్‌ ధాన్యం సేకరణలో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉందని భారత ఆహార సంస్థ ప్రకటించింది. దేశం మొత్తం మీద ఈ సీజన్‌లో 83.01 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ జరగ్గా, ఒక్క తెలంగాణ సొంతంగా 52.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి సరికొత్త రికార్డులు సృష్టించిందని తెలిపింది. ఇప్పటికే తెలంగాణ 91.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా సగానికి పైగా సేకరణపూర్తి చేసిందని వెల్లడించింది.