Breaking News
  • బతకటం కాదు.. ఇతరులకు ఉపయోగపడేలా బతకటం గొప్ప. భౌతికంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దూరమయ్యారు. కానీ ఆయన గళం సంగీతం ఉన్నన్నాళ్లు బతికే ఉంటుంది: రామ్ గోపాల్‌ వర్మ.
  • గాన గంధర్వుని మృతికి తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ప్రగాఢ సంతాపం. 'బాలు'కి నివాళిగా రేపు (26-శనివారం) రికార్డింగ్ థియేటర్స్ మూసివేతకు పిలుపు. 16 భాషల్లో నలభై వేల పాటలు పాడిన 'కారణజన్ముడు' ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు ప్రముఖ గాయని-'తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్' అధ్యక్షురాలు విజయలక్ష్మి. రేపు (26-శనివారం) రికార్డింగ్ థియేటర్స్ అన్నీ స్వచ్చందంగా మూసివేయాలని.. గాయనీగాయకులంతా పాటల రికార్డింగ్స్ కు దూరంగా ఉండాలని.. తెలుగు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆర్.పి.పట్నాయక్, కార్యదర్శి లీనస్, కోశాధికారి రమణ శీలం పిలుపునిచ్చారు. కొవిడ్ నిబంధనలకు లోబడి గాన గంధర్వునికి ఘన నివాళి అర్పించేందుకు త్వరలోనే తేదీని ప్రకటిస్తామని విజయలక్ష్మి తెలిపారు.
  • దేశవ్యాప్త కోవిడ్ గణాంకాలు: 24 గంటల వ్యవధిలో మరణాలు 1,141. మొత్తం కోవిడ్ మరణాలు 92,290. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 58,18,571. దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 9,70,116. దేశంలో మొత్తం రికవరీలు 47,56,164.
  • అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవ్ వర్తింప చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • బాలు గారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు. ఆ ఏలిక మరి రాదు. చాలామంది తమిళ కన్నడ సోదరులు ఆయన తెలుగు వాడంటే ఒప్ప్పుకునేవారు కాదు. బాలు మావాడు అని గొడవ చేసేవారు. అన్ని భాషలలోను పాడారు. అందరిచేత మావాడు అనిపించుకున్నారు. ఈ ఘనత ఒక్క బాలు గారికే సాధ్యం. ఆయన పాడిన పాటలు మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయి. మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. : రాజమౌళి.
  • అమరావతి హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్, సిఐడి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేడపాటి బాల సత్యనారాయణ రెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • అమరావతి : ఎస్పీ బాలు కుటుంబ సభ్యులకు సీఎం ఫోన్‌లో పరామర్శ. అమరావతి: దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ.చరణ్‌తో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. కళా, సాంస్కృతిక రంగానికి ఆయన మరణం తీరనిలోటని అన్నారు. ధైర్యంగా ఉండాలన్నారు. కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు.

ఆ నీళ్లు తాగినా.. ఫుడ్ తిన్నా ప్రమాదమే!

మన డైలీ రొటీన్‌లో ప్లాస్టిక్ వస్తువులనే ఎక్కువగా వాడుతున్నామని ఎప్పుడైనా మీరు గమనించారా.? తాగడం దగ్గర నుంచి తినడం వరకు అన్నీ కూడా ప్లాస్టిక్ వాటిల్లోనే తీసుకుంటుంటాం.

plastic packaging and its effects on food, ఆ నీళ్లు తాగినా.. ఫుడ్ తిన్నా ప్రమాదమే!

మన డైలీ రొటీన్‌లో ప్లాస్టిక్ వస్తువులనే ఎక్కువగా వాడుతున్నామని ఎప్పుడైనా మీరు గమనించారా.? తాగడం దగ్గర నుంచి తినడం వరకు అన్నీ కూడా ప్లాస్టిక్ వాటిల్లోనే తీసుకుంటుంటాం. ఆఫీసుల్లో, ఇంట్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బాటిల్సే. తాగే నీరు ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగుతుంటాం. అంతేకాకుండా ఆహారం కూడా ప్లాస్టిక్ ప్లేట్లలో తింటుంటాం. ఇలా మన జీవితంలో ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయింది.

అయితే ఇలా ప్లాస్టిక్ వాటిల్లో తినడం, తాగడం వల్ల మన ప్రాణానికి ఎంతో ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. వీటి వల్ల మనకు తెలియకుండానే ప్లాస్టిక్ సూక్ష్మకణాలు శరీరంలోకి చేరిపోతాయని అమెరికన్ పరిశోధకులు ఓ పరిశోధన ద్వారా కనుగున్నారు. ఈ అధ్యయనంలో కొంతమంది మీద వారు పరిశోధన జరపగా.. వారి మూత్రంలో 44 రెట్లు ఎక్కువగా ప్లాస్టిక్ సూక్ష్మ కణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందువల్ల సంతానోత్పత్తి, మెదడు పనితీరు దెబ్బతింటుందని.. అంతేకాకుండా కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఇక భారత్‌లో విక్రయించే ప్యాకేజ్డ్‌ ఆహార పదార్ధాలు, ఫాస్ట్‌ ఫుడ్‌లలో ఉప్పు, కొవ్వు, చక్కర స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నాయని  ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ప్యాకేజ్డ్‌ ఫుడ్ ఎక్కువగా తినేవారు ఒబేసిటీ, గుండెకు సంబంధిత రోగాలు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడతారని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. సో ప్లాస్టిక్‌, ప్యాకేజ్డ్ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Also Read: కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!

Related Tags