చిదంబరానికి అరెస్టు తప్పదా.. విచారణ వాయిదా..

మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి మళ్లీ సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. తక్షణమే బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలన్న వాదనని న్యాయస్థానం తోసిపుచ్చింది. చిదంబరం బెయిల్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరుగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు చిదంబరానికి బెయిల్ కోసం కాంగ్రెస్ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జస్టిస్ రమణ చిదంబరం బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వడానికి నిరాకరించారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది చీఫ్ జస్టిస్ అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు […]

చిదంబరానికి అరెస్టు తప్పదా.. విచారణ వాయిదా..
Follow us

| Edited By:

Updated on: Aug 21, 2019 | 5:35 PM

మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి మళ్లీ సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. తక్షణమే బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలన్న వాదనని న్యాయస్థానం తోసిపుచ్చింది. చిదంబరం బెయిల్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరుగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు చిదంబరానికి బెయిల్ కోసం కాంగ్రెస్ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జస్టిస్ రమణ చిదంబరం బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వడానికి నిరాకరించారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది చీఫ్ జస్టిస్ అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది సీబీఐ. దీంతో ఏ క్షణంలోనైనా చిదంబరం అరెస్టు ఖాయమని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ చిదంబరం అచూకీ అంతుచిక్కలేదు. మరోవైపు చిదంబరం ఆచూకీ కోసం సీబీఐ అధికారులు గాలిస్తున్నారు.