చిదంబరం ఇంటికి సీబీఐ.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..?

P Chidambaram Denied Anticipatory Bail In INX Case.. CBI Team At His Home, చిదంబరం ఇంటికి సీబీఐ.. అరెస్ట్‌కు రంగం సిద్ధం..?

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరానికి ఢిల్లీ హై కోర్టు.. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి ఝలక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆయన ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. దీంతో సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీబీఐ బృందం ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో చిదంబరం లేకపోవడంతో వెనుదిరిగారు.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆయనను సీబీఐ పలుమార్లు విచారించింది. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ కోసం ఆయన చేసుకున్న పిటిషన్‌పై మంగళవారం విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన చట్టసభ సభ్యుడైనంత మాత్రాన ముందస్తు బెయిల్‌ ఇవ్వాల్సిన అవసరంలేదని పేర్కొంది. మరోవైపు, హైకోర్టు నిర్ణయాన్ని చిదంబరం తరఫున న్యాయవాది కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కాసేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *