Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

Ozone Day: ‘ఓజోన్‌’తోనే మానవజాతికి జీవం.. పదిలంగా కాపాడుకుందాం

Ozone Day:All you need to know about Ozone, Ozone Day: ‘ఓజోన్‌’తోనే మానవజాతికి జీవం.. పదిలంగా కాపాడుకుందాం

సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడే కవచం ఓజోన్ పొర. మూడు పరమాణువులతో కూడిన ఆక్సిజన్ అణువైన ఓజోన్(O3) వాయు రూపంలో, లేత నీలం రంగులో ఉంటోంది. జీవ మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి భూమికి రక్షణ కల్పిస్తూ వస్తున్న ఈ పొరకు ఇప్పుడు మనమే తూట్లు పొడస్తున్నాం. అడవులను నరికేయడం, కాలుష్యం పెరగడం వల్ల ఓజోన్ వాయువు రోజు రోజుకు తగ్గిపోతోంది. దీని వల్లనే భూతాపం పెరగడం, వానలు కురవకపోవడం వంటి అనర్థాలను ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం.

అయితే ఓజోన్ పొర క్షీణిస్తోందని సరిగ్గా 39ఏళ్ల క్రితం 1982లో పర్యావరణ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో భవిష్యత్‌లో జీవకోటికి పెద్ద ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని గమనించిన ఐక్యరాజ్యసమితి, ఓజోన్ సంరక్షణ కోసం ప్రపంచదేశాలను ఏకం చేసింది. ఆ తరువాత 1987, సెప్టెంబర్ 16న ఓజోన్ సంరక్షణ రోజు రోజుగా ఖరారు చేసింది. ఆపై ప్రతి సంవత్సరం ఈ రోజున ఒక్కో నినాదంతో ప్రచారం చేస్తూ ఓజోన్ పొరపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ‘32 ఇయర్స్ అండ్ హీలింగ్’(గాయం మానుతోంది) అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

పుంజుకుంటోన్న ఓజోన్..?
కాగా 2018లో ఓ సంస్థ చేసిన స్టడీలో.. 2000 సంవత్సరం నుంచి కొన్ని ప్రాంతాల్లో ఓజోన్‌ 1 నుంచి 3 శాతం మేర తిరిగి పుంజుకుంటోందని తేలింది. అంతేకాకుండా కొన్ని చర్యలు తీసుకుంటే 2030లో ఉత్తర ధ్రువంలో.. 2050కు దక్షిణ ధ్రువంలో.. 2060కు పోలార్ ప్రాంతాల్లో పూర్తిగా ఓజోన్‌ను రక్షించుకునే అవకాశం ఉందని ఆ స్టడీ తెలిపింది.

ఓజోన్ దెబ్బ తింటే కలిగే నష్టాలు
ఓజోన్ దెబ్బ తినడం వలన కేవలం మనుషులకే కాదు భూమి మీద నివసిస్తున్న జంతువులు, పక్షులు, చెట్లు అన్నింటికి ప్రమాదమే. ఆ పొర లేకపోతే సూర్యుడి నుంచి వెలువడే తీవ్రమైన అతినీల లోహిత కిరణాలు మనమీద పడి కేన్సర్ రావొచ్చు. అంతేకాదు సూర్యుడి నుంచి పడే కిరణాలను తట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి పలు రకాల రోగాల బారిన పడే అవకాశం ఉంది. వర్షాలు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.

ఓజోన్‌ను రక్షించుకోవాలంటే ఏం చేయాలి?
చెట్లను పెంచాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి.
క్లోరో ఫ్లోరో కార్బన్ల వాడకాన్ని నిషేధించాలి.
సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచాలి.
కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి.
పంటల్లో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి.

Related Tags