గుడ్‌న్యూస్.. వ్యాక్సిన్‌కు అడుగు దూరంలో ఆక్స్‌ఫర్డ్.. కోతులపై సక్సెస్..

కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నింటిని ఈ వైరస్ చుట్టేసింది. దాదాపు 46లక్షల మందికి పైగా ఈ వైరస్ సోకగా.. అందులో దాదాపు మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. మరో పదహారు లక్షల మంది వరకు వైరస్‌ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ వైరస్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో.. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వైరస్‌కు చెక్ పెట్టేందుకు అనేక దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. […]

గుడ్‌న్యూస్.. వ్యాక్సిన్‌కు అడుగు దూరంలో ఆక్స్‌ఫర్డ్.. కోతులపై సక్సెస్..
Follow us

| Edited By:

Updated on: May 16, 2020 | 2:24 PM

కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నింటిని ఈ వైరస్ చుట్టేసింది. దాదాపు 46లక్షల మందికి పైగా ఈ వైరస్ సోకగా.. అందులో దాదాపు మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. మరో పదహారు లక్షల మంది వరకు వైరస్‌ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ వైరస్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో.. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వైరస్‌కు చెక్ పెట్టేందుకు అనేక దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని దేశాలైతే.. క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నాయి. అందులో బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ ముందంజలో ఉంది. ఇప్పటికే కోతులపై ప్రయోగించి.. సక్సెస్ అయ్యింది. ‘సీహెచ్‌ఏడీఓఎక్స్‌1 ఎన్‌సీఓవీ-19’ అనే వ్యాక్సిన్‌తో ‘రేసస్‌ మకాఖ్‌’ జాతికి చెందిన కొన్ని కోతులపై క్లినికల్ ట్రయల్స్ చేశారు. శాస్త్రవేత్తలు జరిపిన ఈ టెస్టులు దాదాపు సక్సెస్‌ అయ్యాయి.

కరోనా మహమ్మారి బారినపడిన ఆరు కోతులకు.. ‘సీహెచ్‌ఏడీఓఎక్స్‌1 ఎన్‌సీఓవీ-19’ వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఆ తర్వాత వాటి ఆరోగ్య పరిస్థితుల్లో వచ్చే మార్పులను 28 రోజులపాటు గమనించారు. ఈ వ్యాక్సిన్ ఊపిరితిత్తులపై దాడి చేయకుండా కరోనా వైర్‌స్‌ మూలాలను అంతం చేసినట్లు గుర్తించారు. అంతేకాదు ఈ వ్యాక్సిన్ ప్రభావంతో ఊపిరితిత్తులలోని బ్రాంకో అల్‌వియోలర్‌ లావేజ్‌ ద్రవం, శ్వాసనాళ కణజాలాల్లో వైరస్‌ సంఖ్య చాలా తగ్గిందని.. వ్యాక్సిన్‌ వల్ల కోతుల్లో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వైరల్‌ న్యుమోనియా లక్షణాలు కూడా కనిపించలేదని స్పష్టంచేశారు.

కోతులపై ప్రయోగంలో ఇబ్బందులు తలెత్తకపోవడంతో.. మనుషులపైన కూడా ప్రయోగాలు కొనసాగిస్తోంది. దీనికి సంబంధించిన రిపోర్టులు వచ్చే నెల జూన్ వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే బ్రిటన్‌లో జరుపుతున్న టెస్టులు సక్సెస్ అయితే.. టీకాను కెన్యాలో మనుషులపై ప్రయోగించాలని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆలోచిస్తోంది. ఈ ప్రయోగాలన్నింటిలో వ్యాక్సిన్ సక్సెస్ అయితే.. ఈ ఏడాది చివరినాటికి 10కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు రెడీగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.