మోదీని ‘ డిక్షనరీ ‘ తో టార్గెట్ చేసిన రాహుల్

oxford dictionary steps in as rahul gandhi slams pm modi, మోదీని ‘ డిక్షనరీ ‘ తో టార్గెట్ చేసిన రాహుల్
ఎన్నికల సంరంభం ముగిసినా..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీని  వదిలిపెట్టడంలేదు. ‘ ఇంగ్లీషు భాషలో కొత్త పదం వచ్చి చేరిందంటూ..’ మళ్ళీ ఎటాక్ చేశారు. మోదీని ఉద్దేశించి.. ‘ మోదీలై ‘ అనే పదం ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చోటు చేసుకుందని సెటైర్ వేశారు. మోదీలై అంటే అదే పనిగా నిజాన్ని వక్రీకరించేవారని అర్థమట. దీన్ని డిక్షనరీ వెబ్ సైట్ స్క్రీన్ షాట్ తో  ఫోటోషాప్ చేసి ఆయన ట్వీట్  చేశారు. ఈ ట్వీట్ కు స్పందించిన ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ..రాహుల్ షేర్ చేసిన ఇమేజ్ ఫేక్ అని, అసలు అది లేనేలేదని పేర్కొంది. స్క్రీన్ షాట్ లోని మరో నిర్వచనం ఏమిటంటే.. అదే పనిగా అబద్ధాలు చెప్పడం, వాటిని అలవాటు చేసుకోవడం..మరొకటి ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా అసత్యాలు వల్లించడం  అని కూడా రాహుల్ సెటైర్ల వర్షం కురిపించారు. అంతే కాదు.. ఈ కొత్త పదం ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అని పేర్కొన్నారు. రాహుల్ అపహాస్యాన్ని ఖండించిన బీజేపీ ఐటీ సెల్ హెడ్.. అమిత్ మాలవీయ.. ఈ డిక్షనరీ ట్వీట్ ని రీ-ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *